Title (Indic)గద్దరి జీవుఁడు కామధేనువు మాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గద్దరి జీవుఁడు కామధేనువు మాని యెద్దుఁ బిదుకఁ జొచ్చె నేది దెరఁగు (॥గద్దరి॥) మటమాయములఁ దనమనసె చంచలమంది ఇటునటుఁ దిరిగిన నేది దెరఁగు కటకట వూరేలు కర్తే దొంగలఁగూడి యెటువలెఁ జేసిన నేదిదెరఁగు (॥గద్దరి॥) కల్లలాడఁగఁ జొచ్చెఁ గలుషపుమతి సత్య మిల్లు వెడలగొట్టె నేదిదెరఁగు చెల్లఁబో నోరే చేఁదుమేయఁగఁ జొచ్చె నెల్లవారికి నింక నేదిదెరఁగు (॥గద్దరి॥) తియ్యని వెంకటాధిపుఁ బాసి పరసేవ కియ్యకొనెడిఁ జిత్తమేది దెరఁగు అయ్యొ చక్కనిపతి నాలు విడిచిపోయి యెయ్యెడఁ దిరిగిన నేదిదెరఁగు English(||pallavi||) gaddari jīvum̐ḍu kāmadhenuvu māni yĕddum̐ bidugam̐ jŏchchĕ nedi dĕram̐gu (||gaddari||) maḍamāyamulam̐ danamanasĕ saṁchalamaṁdi iḍunaḍum̐ dirigina nedi dĕram̐gu kaḍagaḍa vūrelu karde dŏṁgalam̐gūḍi yĕḍuvalĕm̐ jesina nedidĕram̐gu (||gaddari||) kallalāḍam̐gam̐ jŏchchĕm̐ galuṣhabumadi satya millu vĕḍalagŏṭṭĕ nedidĕram̐gu sĕllam̐bo nore sem̐dumeyam̐gam̐ jŏchchĕ nĕllavārigi niṁka nedidĕram̐gu (||gaddari||) tiyyani vĕṁkaḍādhibum̐ bāsi paraseva kiyyagŏnĕḍim̐ jittamedi dĕram̐gu ayyŏ sakkanibadi nālu viḍisiboyi yĕyyĕḍam̐ dirigina nedidĕram̐gu