Title (Indic)గడ్డపార మింగితే నాఁకలి దీరీనా యీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గడ్డపార మింగితే నాఁకలి దీరీనా యీ- వొడ్డిన భవము దన్ను వొడ కమ్ముఁ గాక (॥గడ్డ॥) చించుక మిన్నులఁ బారేచింకలను బండిఁ గట్టి వంచుకొనేమన్న నవి వసమయ్యీనా యెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కు పొంచి పొంచి వలపులు బొండఁబెట్టుఁగాక (॥గడ్డ॥) మంటమండేయగ్గి దెచ్చి మసిపాఁత మూఁటగట్టి యింటిలోన దాఁచుకొన్న నితవయ్యీనా దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు బంటుఁజేసి ఆసలనే పారఁదోసుఁగాక (॥గడ్డ॥) పట్టరాని విషములపాముఁ దెచ్చి తలకిందఁ బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా వెట్టసంసార మిది వేంకటేశుఁ గొలువని- వట్టిమనుజుల పెడవాడఁబెట్టుఁగాక English(||pallavi||) gaḍḍabāra miṁgide nām̐kali dīrīnā yī- vŏḍḍina bhavamu dannu vŏḍa kammum̐ gāga (||gaḍḍa||) siṁchuga minnulam̐ bāresiṁkalanu baṁḍim̐ gaṭṭi vaṁchugŏnemanna navi vasamayyīnā yĕṁcharāni yiṁdriyamu lĕvvarigi nela sikku pŏṁchi pŏṁchi valabulu bŏṁḍam̐bĕṭṭum̐gāga (||gaḍḍa||) maṁṭamaṁḍeyaggi dĕchchi masibām̐ta mūm̐ṭagaṭṭi yiṁṭilona dām̐sugŏnna nidavayyīnā daṁṭamamagāra miṭṭe tannunela sāganichchu baṁṭum̐jesi āsalane pāram̐dosum̐gāga (||gaḍḍa||) paṭṭarāni viṣhamulabāmum̐ dĕchchi talagiṁdam̐ bĕṭṭugŏnnā nadi maṁdabili vuṁḍīnā vĕṭṭasaṁsāra midi veṁkaḍeśhum̐ gŏluvani- vaṭṭimanujula pĕḍavāḍam̐bĕṭṭum̐gāga