Title (Indic)గబ్బిగొల్లెతల ముద్దు ఘనమాయ మాకు నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గబ్బిగొల్లెతల ముద్దు ఘనమాయ మాకు నేఁడు వుబ్బుచు నే చేఁతకైనా నూరకుండే బాలుని (॥గబ్బి॥) యెంగిలి తమ్ములమంటే నెవ్వతె ముద్దాడెనే బంగారువంటిచెక్కుల పసిబాలుని బొంగగార మోవితేనె సోఁ కించె నెవ్వతే ముంగిటనిధానమై ముద్దుగారే బాలుని (॥గబ్బి॥) అండఁ జెమటచన్నుల నద్దు కొన్న దెవ్వతే దండిగా నీరార్చిన తగుబాలుని నిండుబూతు బండుం డిట్టు నేరిపిన దెవ్వతే వొండేమి నెఱుఁగక వూరకుండే బాలుని (॥గబ్బి॥) కొప్పుపువ్వు మెడదండ గుచ్చి కట్టె నెవ్వతే వొప్పుగ దేవరవలె నున్న బాలుని తిప్పితిప్పి వీధులెల్లాఁ దిరిగించె నెవ్వతే ముప్పిరి శ్రీవేంకటాద్రి మూలనున్నబాలుని English(||pallavi||) gabbigŏllĕdala muddu ghanamāya māgu nem̐ḍu vubbusu ne sem̐tagainā nūraguṁḍe bāluni (||gabbi||) yĕṁgili tammulamaṁṭe nĕvvadĕ muddāḍĕne baṁgāruvaṁṭisĕkkula pasibāluni bŏṁgagāra movidenĕ som̐ kiṁchĕ nĕvvade muṁgiḍanidhānamai muddugāre bāluni (||gabbi||) aṁḍam̐ jĕmaḍasannula naddu kŏnna dĕvvade daṁḍigā nīrārsina tagubāluni niṁḍubūdu baṁḍuṁ ḍiṭṭu neribina dĕvvade vŏṁḍemi nĕṟum̐gaga vūraguṁḍe bāluni (||gabbi||) kŏppubuvvu mĕḍadaṁḍa guchchi kaṭṭĕ nĕvvade vŏppuga devaravalĕ nunna bāluni tippidippi vīdhulĕllām̐ dirigiṁchĕ nĕvvade muppiri śhrīveṁkaḍādri mūlanunnabāluni