Title (Indic)గాలికూటి పేరిగట్టు మీఁదటివాఁడ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గాలికూటి పేరిగట్టు మీఁదటివాఁడ నేల సోద్యము పేరి నెలఁతయై నిన్ను మెచ్చె (॥గాలి॥) తెలిమొయిలుపేరిటి తిలకము వెట్టి వెలయఁ బైరెడి పేరి విరులు ముడిచి బలిమి మరుని పేరిపండు చేఁ బట్టి జలజము పేరిటిసతి నిన్నుఁ జూచె (॥గాలి॥) రేగాముపరిటి రెంటెము గట్టి భోగిపేరితీగాకు పొఁసఁగ జుట్టుచును బాగుగాఁ జుక్క పేరి యాభరణాలు వెట్టి నాగముపేరిటి నాతి నిన్నుఁ బిలిచె (॥గాలి॥) సురపతిపేరిట్టి సరులు ధరించి శిరుల మౌనిపేరి జీవముఁబట్టి పొరి నీటిపేరిపాన్పున శ్రీవెంకటనాథ విరిమీఁదిబిడ్డపేరి వెలఁది నిన్నుఁ గూడె. English(||pallavi||) gāligūḍi perigaṭṭu mīm̐daḍivām̐ḍa nela sodyamu peri nĕlam̐tayai ninnu mĕchchĕ (||gāli||) tĕlimŏyiluberiḍi tilagamu vĕṭṭi vĕlayam̐ bairĕḍi peri virulu muḍisi balimi maruni peribaṁḍu sem̐ baṭṭi jalajamu periḍisadi ninnum̐ jūsĕ (||gāli||) regāmubariḍi rĕṁṭĕmu gaṭṭi bhogiberidīgāgu pŏm̐sam̐ga juṭṭusunu bāgugām̐ jukka peri yābharaṇālu vĕṭṭi nāgamuberiḍi nādi ninnum̐ bilisĕ (||gāli||) surabadiberiṭṭi sarulu dhariṁchi śhirula mauniberi jīvamum̐baṭṭi pŏri nīḍiberibānpuna śhrīvĕṁkaḍanātha virimīm̐dibiḍḍaberi vĕlam̐di ninnum̐ gūḍĕ.