Title (Indic)గాడిదెఁ గూయకుండఁ గంసుఁడెఱఁగకుండ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గాడిదెఁ గూయకుండఁ గంసుఁడెఱఁగకుండ వేడుక వసుదేవునకు విన్నవించరో (॥గాడి॥) దేవతలు జయవెట్ట దేవకి గర్భమునందు యీవేళ నేనుగబిడ్డఁ డిదె జనించె పూపులవాన గురిసె భూభార మెల్లఁ ధీరె వేవేగ నొజ్జళ్లు వేళ చూడరో (॥గాడి॥) అద్దమరాతిరికాడ నటు చంద్రొదయముతో వొద్దికఁ గృష్ణుఁడు వుట్టె నోచెలులాల సుద్దులెల్లఁ జెప్పఁజోచ్చెఁజూపె నాల్గుచేతులవె పొద్దున సోబన మిట్టె పొలఁతులు సేయరో (॥గాడి॥) సంకుజక్రములు వట్టి సాదుల నిందరిఁ గావ తెంకినే శ్రీవేంకటాద్రిదేవుఁడు వుట్టె కొంకుఁబనులెల్లాఁ దేరె కోరి తొట్టెలఁ బెట్టరే లంకె బలభద్రుతోడ లలనలు వెంచరో English(||pallavi||) gāḍidĕm̐ gūyaguṁḍam̐ gaṁsum̐ḍĕṟam̐gaguṁḍa veḍuga vasudevunagu vinnaviṁcharo (||gāḍi||) devadalu jayavĕṭṭa devagi garbhamunaṁdu yīveḽa nenugabiḍḍam̐ ḍidĕ janiṁchĕ pūbulavāna gurisĕ bhūbhāra mĕllam̐ dhīrĕ vevega nŏjjaḽlu veḽa sūḍaro (||gāḍi||) addamarādirigāḍa naḍu saṁdrŏdayamudo vŏddigam̐ gṛṣhṇum̐ḍu vuṭṭĕ nosĕlulāla suddulĕllam̐ jĕppam̐jochchĕm̐jūbĕ nālgusedulavĕ pŏdduna sobana miṭṭĕ pŏlam̐tulu seyaro (||gāḍi||) saṁkujakramulu vaṭṭi sādula niṁdarim̐ gāva tĕṁkine śhrīveṁkaḍādridevum̐ḍu vuṭṭĕ kŏṁkum̐banulĕllām̐ derĕ kori tŏṭṭĕlam̐ bĕṭṭare laṁkĕ balabhadrudoḍa lalanalu vĕṁcharo