Title (Indic)గాడిదెపిల్ల కోమలికమె కలిగినది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గాడిదెపిల్ల కోమలికమె కలిగినది వేడుకపడు సంసారమె విసిగించు వెనక (॥గాడి॥) అగపడు సంపదమీదట నాసలు కడుఁ బుట్టు వగ నది భరియింప వసమె కాదయ్య మొగమె చూడఁగ నాపై ముదమునఁ గనుపట్టు పొగులఁగ గరచెటికాట్లు పులికంటె బెట్టు (॥గాడి॥) విడువని భోగంబులపై వేడుక కడుఁ బుట్టు తడఁబడులంపట మైతే తలఁచనె రాదయ్య తొడి మెను మాగినపండైతే తోఁచుఁ జూచినను వడియఁబడి గొడ్డంటికి వసమె కాదెవుడు (॥గాడి॥) మోవఁగ విషయంబులపై మోహము కడుఁ బుట్టు శ్రీవెంకటనాథా అది చెప్పఁగ రాదయ్య ఆవలఁజూడఁగఁ జల్లనై వుండుఁ గాని తేవలఁ గూఁకటవేళ్లు తెగఁ బారును మిగులా English(||pallavi||) gāḍidĕbilla komaligamĕ kaliginadi veḍugabaḍu saṁsāramĕ visigiṁchu vĕnaga (||gāḍi||) agabaḍu saṁpadamīdaḍa nāsalu kaḍum̐ buṭṭu vaga nadi bhariyiṁpa vasamĕ kādayya mŏgamĕ sūḍam̐ga nābai mudamunam̐ ganubaṭṭu pŏgulam̐ga garasĕḍigāṭlu puligaṁṭĕ bĕṭṭu (||gāḍi||) viḍuvani bhogaṁbulabai veḍuga kaḍum̐ buṭṭu taḍam̐baḍulaṁpaḍa maide talam̐sanĕ rādayya tŏḍi mĕnu māginabaṁḍaide tom̐sum̐ jūsinanu vaḍiyam̐baḍi gŏḍḍaṁṭigi vasamĕ kādĕvuḍu (||gāḍi||) movam̐ga viṣhayaṁbulabai mohamu kaḍum̐ buṭṭu śhrīvĕṁkaḍanāthā adi sĕppam̐ga rādayya āvalam̐jūḍam̐gam̐ jallanai vuṁḍum̐ gāni tevalam̐ gūm̐kaḍaveḽlu tĕgam̐ bārunu migulā