Title (Indic)ఎవ్వరు నిన్నాడుకొనే రేది వెంగె మిందులోన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎవ్వరు నిన్నాడుకొనే రేది వెంగె మిందులోన రవ్వగా మొక్కఁగరాదా రచ్చలోన నీకును (॥ఎవ్వ॥) తగవరివౌదువు తప్పు నీయందేమిలేదు నగరాదా వూరకె నాలోనను వెగటు నీ కెక్కడిది వెరపు నీకిఁకనేల మొగము చూడరాదా ముంచి నాకు నేఁడు (॥ఎవ్వ॥) పంతగాఁడ వొదువు బాససేసితే మీరవు సంతోసించఁగరాదా సారెసారెకు వింతవా రిందులో వేరీ; వేడుకచుట్టానే నీకు మంతనమాడుకోరాదా మాలో మేము (॥ఎవ్వ॥) దయగలవాఁడవు తగ్గుముగ్గు లెరఁగవు ప్రియము చెప్పఁగరాదా పెనఁగి నీకు నియతి శ్రీవేంకటేశ నీవు నన్ను నేలితివి నయము చూపఁగరాదా నంటుసేసి నీకు English(||pallavi||) ĕvvaru ninnāḍugŏne redi vĕṁgĕ miṁdulona ravvagā mŏkkam̐garādā rachchalona nīgunu (||ĕvva||) tagavarivauduvu tappu nīyaṁdemiledu nagarādā vūragĕ nālonanu vĕgaḍu nī kĕkkaḍidi vĕrabu nīgim̐kanela mŏgamu sūḍarādā muṁchi nāgu nem̐ḍu (||ĕvva||) paṁtagām̐ḍa vŏduvu bāsaseside mīravu saṁtosiṁcham̐garādā sārĕsārĕgu viṁtavā riṁdulo verī; veḍugasuṭṭāne nīgu maṁtanamāḍugorādā mālo memu (||ĕvva||) dayagalavām̐ḍavu taggumuggu lĕram̐gavu priyamu sĕppam̐garādā pĕnam̐gi nīgu niyadi śhrīveṁkaḍeśha nīvu nannu nelidivi nayamu sūbam̐garādā naṁṭusesi nīgu