Title (Indic)ఎవ్వరికిఁ గలదమ్మ యింత భాగ్యము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎవ్వరికిఁ గలదమ్మ యింత భాగ్యము ఇవ్వల నీతో సరి యెంచరాదే వొరుల (॥ఎవ్వ॥) వీడిన తురుము తోడ విరులు పై పైరాల వాడిన కన్నుల తోడ వచ్చేవేమే యేడనుంటి విందాఁకా యెవ్వఁడు నిన్ను భోగించె చేడె నీ సొబగులిదే చెప్పరాదె నేఁడు (॥ఎవ్వ॥) వడియుఁ జెమటల తోడ వత్తివంటి మోవి తోడ నడపు మురిపెముతో నవ్వేవేమే యెడచొచ్చి నీ జవ్వన మెవ్వఁడు కొల్లలుగొనె పడఁతి నీ చెలువము పట్టురాదె యిపుడు (॥ఎవ్వ॥) నిద్దుర కన్నుల తోడ నిండుఁ బులకల తోడ ముద్దుగారే మోము తోడ మురిసేవేమే వొద్దనె శ్రీ వేంకటేశుఁడొగిఁ గూడుతె(టె?) ఱఁగమే ముద్దరాల నేఁడు నీమోహమెంచరాదే English(||pallavi||) ĕvvarigim̐ galadamma yiṁta bhāgyamu ivvala nīdo sari yĕṁcharāde vŏrula (||ĕvva||) vīḍina turumu toḍa virulu pai pairāla vāḍina kannula toḍa vachcheveme yeḍanuṁṭi viṁdām̐kā yĕvvam̐ḍu ninnu bhogiṁchĕ seḍĕ nī sŏbagulide sĕpparādĕ nem̐ḍu (||ĕvva||) vaḍiyum̐ jĕmaḍala toḍa vattivaṁṭi movi toḍa naḍabu muribĕmudo navveveme yĕḍasŏchchi nī javvana mĕvvam̐ḍu kŏllalugŏnĕ paḍam̐ti nī sĕluvamu paṭṭurādĕ yibuḍu (||ĕvva||) niddura kannula toḍa niṁḍum̐ bulagala toḍa muddugāre momu toḍa muriseveme vŏddanĕ śhrī veṁkaḍeśhum̐ḍŏgim̐ gūḍudĕ(ṭĕ?) ṟam̐game muddarāla nem̐ḍu nīmohamĕṁcharāde