Title (Indic)ఎట్టు సేసినా నమరు ఇంతటి దొరవు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎట్టు సేసినా నమరు ఇంతటి దొరవు నీవు గట్టువాయతనమేల కరుణించరాదా (॥ఎట్టు॥) చెలి పనివడి నీతో చెవిలోన విన్నవించఁగా మలసి వేరొకతెతో మాటలాడేవు యెలమి నాపె నిన్ను నేమీ ననఁజాలక సెలవుల నవ్వు నవ్వీఁ జిత్తగించరాదా (॥ఎట్టు॥) చివ్వన నీసతి నీచేతికిఁ గానుకియ్యఁగా అవ్వలియాపె నుంగర మడిగేవు నివ్వటిల్ల నిందుకుఁగా నెమ్మి నందాలుసేసుక పువ్వులవేసీ నిన్నుఁ బొందుచూపరాదా (॥ఎట్టు॥) అసల నలమేల్మంగ అట్టె కాఁగిలించుకోఁగా నేసవెట్టే విందరిపై శ్రీవేంకటేశ యేసుద్దులూఁ దడవక యిన్నిటాఁ బొగడె నిన్ను లాసి నీరతులకు లాలించరాదా English(||pallavi||) ĕṭṭu sesinā namaru iṁtaḍi dŏravu nīvu gaṭṭuvāyadanamela karuṇiṁcharādā (||ĕṭṭu||) sĕli panivaḍi nīdo sĕvilona vinnaviṁcham̐gā malasi verŏgadĕdo māḍalāḍevu yĕlami nābĕ ninnu nemī nanam̐jālaga sĕlavula navvu navvīm̐ jittagiṁcharādā (||ĕṭṭu||) sivvana nīsadi nīsedigim̐ gānugiyyam̐gā avvaliyābĕ nuṁgara maḍigevu nivvaḍilla niṁdugum̐gā nĕmmi naṁdālusesuga puvvulavesī ninnum̐ bŏṁdusūbarādā (||ĕṭṭu||) asala nalamelmaṁga aṭṭĕ kām̐giliṁchugom̐gā nesavĕṭṭe viṁdaribai śhrīveṁkaḍeśha yesuddulūm̐ daḍavaga yinniḍām̐ bŏgaḍĕ ninnu lāsi nīradulagu lāliṁcharādā