Title (Indic)ఎప్పటివలె నుండరే యెరవులు మీకేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎప్పటివలె నుండరే యెరవులు మీకేల కుప్పలుఁదెప్పలునాయ గురుతైన వలపు (॥ఎప్ప॥) మచ్చికకు వెల లేదు మాటలకుఁ దుద లేదు గచ్చులేల సేసేవే కాంతునితోను ఇచ్చకమాడినదాన వెగసక్కే లాడనేల పచ్చివెచ్చిఁ జేయకువే పాయని నీ వలపు (॥ఎప్పు॥) చేపులకు వంత లేదు సొంపులకు వేళలేదు పైపై నలుగుదురా పతితోను చేపట్టినదానవు సిగ్గులువదుదురా ఆపసోపాలఁ బెట్టకు అందపునీవలపు (॥ఎప్ప॥) కూటమికి గురిలేదు కోరకకు కొద్ది లేదు గాటారింపులేలే శ్రీవేంకటేశుతోను చాటి కూడినదానవు జడియఁగనేమిటికి తూఁటతాఁటల దాఁచకు తోరపునీవలపు English(||pallavi||) ĕppaḍivalĕ nuṁḍare yĕravulu mīgela kuppalum̐dĕppalunāya gurudaina valabu (||ĕppa||) machchigagu vĕla ledu māḍalagum̐ duda ledu gachchulela seseve kāṁtunidonu ichchagamāḍinadāna vĕgasakke lāḍanela pachchivĕchchim̐ jeyaguve pāyani nī valabu (||ĕppu||) sebulagu vaṁta ledu sŏṁpulagu veḽaledu paibai nalugudurā padidonu sebaṭṭinadānavu sigguluvadudurā ābasobālam̐ bĕṭṭagu aṁdabunīvalabu (||ĕppa||) kūḍamigi guriledu koragagu kŏddi ledu gāḍāriṁpulele śhrīveṁkaḍeśhudonu sāḍi kūḍinadānavu jaḍiyam̐ganemiḍigi tūm̐ṭadām̐ṭala dām̐sagu torabunīvalabu