Title (Indic)ఏనాటి చుట్టరికమో యీపె నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏనాటి చుట్టరికమో యీపె నీకు నానఁబెట్టీ వలపులు నయముతో నిపుడు (॥ఏనాటి॥) మొలకసిగ్గులుతోడ ముసిముసి నవ్వు నవ్వి కలికి చూపులఁ జూచీ కాంత నిన్ను పలుకుఁదేనెలు చింద పలుమారు మాఁటలాడి తలఁపించీఁ దనపొందు తా నెవ్వతోకాని (॥ఏనాటి॥) చెదరుఁ గురులతోడ సేఁసకొప్పు గొంత వంచి కుదురు గుబ్బల నొత్తీ కోమలి నిన్ను ముదురు గోళ్లచేత మొక్కులు నీకు మొక్కి యెదుటనే నిలుచునన దెవ్వతోకాని (॥ఏనాటి॥) కరఁగుఁ జెమటతోడ కాఁగిట నిన్నుఁ బట్టి మెరుఁగుఁజెక్కుల మెచ్చీ మెలుఁత నిన్ను గురిగా శ్రీవేంకటేశ కూచితివి నన్నుఁ దొల్లె యెరిఁగించీఁ దనరాక ఇదెవ్వతోకాని English(||pallavi||) enāḍi suṭṭarigamo yībĕ nīgu nānam̐bĕṭṭī valabulu nayamudo nibuḍu (||enāḍi||) mŏlagasigguludoḍa musimusi navvu navvi kaligi sūbulam̐ jūsī kāṁta ninnu palugum̐denĕlu siṁda palumāru mām̐ṭalāḍi talam̐piṁchīm̐ danabŏṁdu tā nĕvvadogāni (||enāḍi||) sĕdarum̐ guruladoḍa sem̐sagŏppu gŏṁta vaṁchi kuduru gubbala nŏttī komali ninnu muduru goḽlaseda mŏkkulu nīgu mŏkki yĕduḍane nilusunana dĕvvadogāni (||enāḍi||) karam̐gum̐ jĕmaḍadoḍa kām̐giḍa ninnum̐ baṭṭi mĕrum̐gum̐jĕkkula mĕchchī mĕlum̐ta ninnu gurigā śhrīveṁkaḍeśha kūsidivi nannum̐ dŏllĕ yĕrim̐giṁchīm̐ danarāga idĕvvadogāni