Title (Indic)ఏఁటిమాట లివి విన నింపయ్యీనా మది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏఁటిమాట లివి విన నింపయ్యీనా మది- నేఁటవెట్టి దాసుఁడౌ టిదిసరియా (॥ఏఁటి॥) జీవుఁడే దేవుఁడని చెప్పుదురు గొందరు దైవముచేఁతలెల్లాఁ దమ కున్నవా ఆవలఁ గొందరు కర్మ మది బ్రహ్మ మందురు రావణాదు లవి సేసి రతికెక్కిరా (॥ఏఁటి॥) మిగులఁ గొందర దైవమే లేదనెందురు తగ నీప్రపంచమెల్లాఁ దనచేఁతలా గగన మతఁడు నిరాకార మందురు గొంద- రెగువఁ బురుషసూక్త మెఱఁగరా తాము (॥ఏఁటి॥) యెనిమిది గుణములే యితని వందురు గొంద- రనయము మిగిలిన వవి దమవా యెనయఁగ శ్రీవేంకటేశ్వరుదాసులై మనుట నిత్యముగాక మరి యేమినేలా English(||pallavi||) em̐ṭimāḍa livi vina niṁpayyīnā madi- nem̐ṭavĕṭṭi dāsum̐ḍau ṭidisariyā (||em̐ṭi||) jīvum̐ḍe devum̐ḍani sĕppuduru gŏṁdaru daivamusem̐talĕllām̐ dama kunnavā āvalam̐ gŏṁdaru karma madi brahma maṁduru rāvaṇādu lavi sesi radigĕkkirā (||em̐ṭi||) migulam̐ gŏṁdara daivame ledanĕṁduru taga nīprabaṁchamĕllām̐ danasem̐talā gagana madam̐ḍu nirāgāra maṁduru gŏṁda- rĕguvam̐ buruṣhasūkta mĕṟam̐garā tāmu (||em̐ṭi||) yĕnimidi guṇamule yidani vaṁduru gŏṁda- ranayamu migilina vavi damavā yĕnayam̐ga śhrīveṁkaḍeśhvarudāsulai manuḍa nityamugāga mari yeminelā