Title (Indic)ఏఁటికిఁ గొసరవలె నీతఁ డిన్నిటా జాణ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏఁటికిఁ గొసరవలె నీతఁ డిన్నిటా జాణ చాటువగా తానే నాకుఁ జనవిచ్చీఁ గాక (॥ఏటి॥) ఆలినేటేటివాఁడే అన్నిబుద్దులునుఁ జెప్పు లాలించి భోగించనేర్చు లాగులుగాను మేలుగలిగినవాఁడే మిక్కిలివేడుక చూపి పాలించి మేలములాడి పనిగొననేర్చును (॥ఏటి॥) సేసలు వెట్టినవాఁడే సిగ్గుతో వహించుకొని వాసితో మనుపనేర్చు వన్నెకెక్కను ఆసకొలిపినవాండే ఆదరానఁ గాఁలించి వేసటలేక వలపు వెలయించనేర్చును (॥ఏటి॥) రతిఁ గలసినవాండే రమణతో మోవియిచ్చి మతికి సంతోసముగా మన్నించును ఇతఁడు శ్రీవేంకటేశుం డే నలమేలుమంగను ఇతవెరిఁగి సారెకు నెనయఁగనేర్చును English(||pallavi||) em̐ṭigim̐ gŏsaravalĕ nīdam̐ ḍinniḍā jāṇa sāḍuvagā tāne nāgum̐ janavichchīm̐ gāga (||eḍi||) ālineḍeḍivām̐ḍe annibuddulunum̐ jĕppu lāliṁchi bhogiṁchanersu lāgulugānu melugaliginavām̐ḍe mikkiliveḍuga sūbi pāliṁchi melamulāḍi panigŏnanersunu (||eḍi||) sesalu vĕṭṭinavām̐ḍe siggudo vahiṁchugŏni vāsido manubanersu vannĕgĕkkanu āsagŏlibinavāṁḍe ādarānam̐ gām̐liṁchi vesaḍalega valabu vĕlayiṁchanersunu (||eḍi||) radim̐ galasinavāṁḍe ramaṇado moviyichchi madigi saṁtosamugā manniṁchunu idam̐ḍu śhrīveṁkaḍeśhuṁ ḍe nalamelumaṁganu idavĕrim̐gi sārĕgu nĕnayam̐ganersunu