Title (Indic)ఏఁటికిఁ గొంకేవు నీవు యెవ్వరున్నా రీడను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏఁటికిఁ గొంకేవు నీవు యెవ్వరున్నా రీడను నాఁటుకొన్న మోహములు నడపరాదా (॥ఏఁటి॥) వాలుకచూపులయాపె వంచివంచి మాటాడఁగా నాలిసేసి నీవేల నవ్వే వీడ బేలవై; యేకతానకుఁ బిలిచి మాటాడరాదా యీలాగుల మీకోరిక లీడేరీఁగాని (॥ఏఁటి॥) చనుమొనలు చూపును సరసములాడఁగాను నినుపునిట్టూర్పులేల నించే వీడ మనసు గరఁ దొల్లె మన్నించి కూడఁగరాదా వెనకటిసిగ్గు లె ల్లా వీడీఁగాని (॥ఏంటి॥) పంతము నెరపి కొంగువట్టి యాపె దియ్యఁగాను చెంత నాపైఁ జేయిచాఁచి చెనకే వీడ వంతుకు శ్రీవేంకటేశ వడి నన్ను నేలితివి చింత వాపరాదా తానే సెలవిచ్చీఁగాని English(||pallavi||) em̐ṭigim̐ gŏṁkevu nīvu yĕvvarunnā rīḍanu nām̐ṭugŏnna mohamulu naḍabarādā (||em̐ṭi||) vālugasūbulayābĕ vaṁchivaṁchi māḍāḍam̐gā nālisesi nīvela navve vīḍa belavai; yegadānagum̐ bilisi māḍāḍarādā yīlāgula mīgoriga līḍerīm̐gāni (||em̐ṭi||) sanumŏnalu sūbunu sarasamulāḍam̐gānu ninubuniṭṭūrbulela niṁche vīḍa manasu garam̐ dŏllĕ manniṁchi kūḍam̐garādā vĕnagaḍisiggu lĕ llā vīḍīm̐gāni (||eṁṭi||) paṁtamu nĕrabi kŏṁguvaṭṭi yābĕ diyyam̐gānu sĕṁta nābaim̐ jeyisām̐si sĕnage vīḍa vaṁtugu śhrīveṁkaḍeśha vaḍi nannu nelidivi siṁta vābarādā tāne sĕlavichchīm̐gāni