Title (Indic)ఏఁటికి శిరసువంచే వెదిరించి యాతనితో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏఁటికి శిరసువంచే వెదిరించి యాతనితో మాఁటలాడఁ గదవే మన్నించీ నతఁడు (॥ఏటి॥) కొనచూపులనుఁ జూచి కూరిమిగొరితేను మనసు రంజిల్లును మగవానికి వినయము లేసేసి వేమారుఁ దగిలితేను ననిచి మిక్కిలి లోలో నంటు సమకూరును (॥ఏటి॥) వాడికవలపు చల్లి వద్దఁ గొలువు సేసితే వేడుకలు వుట్టును విభునికీని వీడెమందుకొని కొంత వెల్లవిరిగా నవ్వితే చూడఁ జూడఁ బాయరాని చుట్టరిక మబ్బును (॥ఏటి॥) మచ్చికలే పచరించి మంతనానఁ బొదిగితే యిచ్చక మవును శ్రీవేంకటేశ్వరునకు వచ్చినట్టే వచ్చి కైవసమై మెలఁగితేను మెచ్చు లిద్దరికి లోలో మిక్కుటమై నిండును English(||pallavi||) em̐ṭigi śhirasuvaṁche vĕdiriṁchi yādanido mām̐ṭalāḍam̐ gadave manniṁchī nadam̐ḍu (||eḍi||) kŏnasūbulanum̐ jūsi kūrimigŏridenu manasu raṁjillunu magavānigi vinayamu lesesi vemārum̐ dagilidenu nanisi mikkili lolo naṁṭu samagūrunu (||eḍi||) vāḍigavalabu salli vaddam̐ gŏluvu seside veḍugalu vuṭṭunu vibhunigīni vīḍĕmaṁdugŏni kŏṁta vĕllavirigā navvide sūḍam̐ jūḍam̐ bāyarāni suṭṭariga mabbunu (||eḍi||) machchigale pasariṁchi maṁtanānam̐ bŏdigide yichchaga mavunu śhrīveṁkaḍeśhvarunagu vachchinaṭṭe vachchi kaivasamai mĕlam̐gidenu mĕchchu liddarigi lolo mikkuḍamai niṁḍunu