Title (Indic)ఏఁటికయ్యా నీతో మాకు యేలాటములాడను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏఁటికయ్యా నీతో మాకు యేలాటములాడను చీటికిమాటికి సంతోసించుటేకాక (॥ఏటి॥) సులభమా నీతోను సొలసి మాటాడేది అలరి నీ కిచ్చలాడేఆఁటదానను తలవంచుకొని నీదండ నిట్టె కాచుకుండి చెలగి నీ చెప్పినట్టుసేసే దింతేకాక (॥ఏటి॥) గరువమా నాకు నిన్నుఁ గదిసి తప్పకచూడ ఇరవుగఁ బెండ్లాడినయిల్లాలను వరుసతో నీచిత్తమువచ్చినట్టే సేవసేసి బెరసి నీచేత మెప్పించుకొంటగాక (॥ఏటి॥) యెమ్మెలా నీతో నేను యెలయించి నవ్వునవ్వ నెమ్మి నలమేల్ మంగను నీదేవులను యిమ్ముల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె వుమ్మడిరతులఁ గూడి వుండు టింతేకాక English(||pallavi||) em̐ṭigayyā nīdo māgu yelāḍamulāḍanu sīḍigimāḍigi saṁtosiṁchuḍegāga (||eḍi||) sulabhamā nīdonu sŏlasi māḍāḍedi alari nī kichchalāḍeām̐ṭadānanu talavaṁchugŏni nīdaṁḍa niṭṭĕ kāsuguṁḍi sĕlagi nī sĕppinaṭṭusese diṁtegāga (||eḍi||) garuvamā nāgu ninnum̐ gadisi tappagasūḍa iravugam̐ bĕṁḍlāḍinayillālanu varusado nīsittamuvachchinaṭṭe sevasesi bĕrasi nīseda mĕppiṁchugŏṁṭagāga (||eḍi||) yĕmmĕlā nīdo nenu yĕlayiṁchi navvunavva nĕmmi nalamel maṁganu nīdevulanu yimmula śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ vummaḍiradulam̐ gūḍi vuṁḍu ṭiṁtegāga