Title (Indic)ఏఁటి జాణతనము నీవే(విదే?)మయ్యా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏఁటి జాణతనము నీవే(విదే?)మయ్యా ఆఁటదానిమీఁద నీవదేమయ్యా (॥ఏఁటి॥) చిత్తరు ప్రతిమవలెఁ బేరి నిలుచుండఁగాను హత్తి రమ్మని పిలువవదేమయ్యా కొత్తకొత్త సిగ్గుతోడ కురులు దువ్వుకోఁగాను యిత్తల మాటలాడించేవిదేమయ్యా (॥ఏఁటి॥) మూసిన ముత్తెమువలె ముసుగు వెట్టుకుండఁగా- నాసఁ గూచుండఁ బెట్టుకోవదేమయ్యా సేసకొప్పు వంచుకొని చింతతోడనుండఁగాను యీసుదీరఁ జెక్కు నొక్కవిదేమయ్యా (॥ఏఁటి॥) తనియని తమకాన తప్పక నిన్నుఁ జూడఁగా అనుగు సరసమాడవదేమయ్యా యెనసితి శ్రీవేంకటేశ యింతి నీవిట్టే యినుమడించె వలపులిదేమయ్యా English(||pallavi||) em̐ṭi jāṇadanamu nīve(vide?)mayyā ām̐ṭadānimīm̐da nīvademayyā (||em̐ṭi||) sittaru pradimavalĕm̐ beri nilusuṁḍam̐gānu hatti rammani piluvavademayyā kŏttagŏtta siggudoḍa kurulu duvvugom̐gānu yittala māḍalāḍiṁchevidemayyā (||em̐ṭi||) mūsina muttĕmuvalĕ musugu vĕṭṭuguṁḍam̐gā- nāsam̐ gūsuṁḍam̐ bĕṭṭugovademayyā sesagŏppu vaṁchugŏni siṁtadoḍanuṁḍam̐gānu yīsudīram̐ jĕkku nŏkkavidemayyā (||em̐ṭi||) taniyani tamagāna tappaga ninnum̐ jūḍam̐gā anugu sarasamāḍavademayyā yĕnasidi śhrīveṁkaḍeśha yiṁti nīviṭṭe yinumaḍiṁchĕ valabulidemayyā