Title (Indic)ఎంతచేసిన నీవిద్య లేల మానేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంతచేసిన నీవిద్య లేల మానేవు బంతినే నీ నవ్వులెల్లాఁ బచరింతువుగాక (॥ఎంత॥) వెక్కసపుమాఁట లాడి వేమారు నిన్నుఁ దిట్టేటి- యెక్కువసతులకుఁగా కేల వంగేవు మొక్కులు మొక్కి నేము ముందే సేవలుసేయఁగ మిక్కుటపుపంతాలు మామీఁద నింతువుగాక (॥ఎంత॥) కొప్పువట్టితీసి నిన్ను గోరు నీమీఁదఁ బెట్టేటి- యెప్పటియింతులకుఁగా కేల వంగేవు ముప్పిరిఁ బ్రియాలుచెప్పి మొగమోడి పొందఁగాను ఇప్పు డింతేసి మమ్ము నెలయించఁదగదా (॥ఎంత॥) పరపుపైఁ బడవేసి పచ్చిమోవి గంటిచేసే- యెరవులవారికిఁగా కేల వంగేవు అరిది శ్రీవేంకటేశ ఆలమేల్మంగ నేనంటా సరవిఁ గూడితి వింత చవిసేయవలదా English(||pallavi||) ĕṁtasesina nīvidya lela mānevu baṁtine nī navvulĕllām̐ basariṁtuvugāga (||ĕṁta||) vĕkkasabumām̐ṭa lāḍi vemāru ninnum̐ diṭṭeḍi- yĕkkuvasadulagum̐gā kela vaṁgevu mŏkkulu mŏkki nemu muṁde sevaluseyam̐ga mikkuḍabubaṁtālu māmīm̐da niṁtuvugāga (||ĕṁta||) kŏppuvaṭṭidīsi ninnu goru nīmīm̐dam̐ bĕṭṭeḍi- yĕppaḍiyiṁtulagum̐gā kela vaṁgevu muppirim̐ briyālusĕppi mŏgamoḍi pŏṁdam̐gānu ippu ḍiṁtesi mammu nĕlayiṁcham̐dagadā (||ĕṁta||) parabubaim̐ baḍavesi pachchimovi gaṁṭisese- yĕravulavārigim̐gā kela vaṁgevu aridi śhrīveṁkaḍeśha ālamelmaṁga nenaṁṭā saravim̐ gūḍidi viṁta saviseyavaladā