Title (Indic)ఎంతైన మాన వివి యేమి సేతునే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంతైన మాన వివి యేమి సేతునే వింతల నాలోని గుట్టు వెళ్లవేసీఁ బాయము (॥ఎంతై॥) మనసులోపలి మాట మతిలోనే దాఁచితేను తనువునఁ జెమటలై దైవారీనే మునుకొన్నసిగ్గులెల్ల మోవిపై నణఁచితేను వెనక నవ్వువెన్నెలై వెల్లి విరిసీనే (॥ఎంతై॥) గక్కనఁ గోరికలెల్ల కాయములో దాచితేను చిక్కుల పులకలై చిగిరంచీనే మక్కువనా వలపులు మరుగునఁబెట్టితేను చిక్కని నిట్టూరుపులై చేగలు దేరీనే (॥ఎంతై॥) తమకములకుఁ గాక తలవంచుకొంటేను జమళిఁ బరవశమై జాజు కొనీనే అమరి శ్రీవేంకటేశుఁ డంతలోనె కూడఁగాను గములైన సంతసాలు కళలు మీరీనే English(||pallavi||) ĕṁtaina māna vivi yemi sedune viṁtala nāloni guṭṭu vĕḽlavesīm̐ bāyamu (||ĕṁtai||) manasulobali māḍa madilone dām̐sidenu tanuvunam̐ jĕmaḍalai daivārīne munugŏnnasiggulĕlla movibai naṇam̐sidenu vĕnaga navvuvĕnnĕlai vĕlli virisīne (||ĕṁtai||) gakkanam̐ gorigalĕlla kāyamulo dāsidenu sikkula pulagalai sigiraṁchīne makkuvanā valabulu marugunam̐bĕṭṭidenu sikkani niṭṭūrubulai segalu derīne (||ĕṁtai||) tamagamulagum̐ gāga talavaṁchugŏṁṭenu jamaḽim̐ baravaśhamai jāju kŏnīne amari śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ kūḍam̐gānu gamulaina saṁtasālu kaḽalu mīrīne