Title (Indic)ఎంతకెంత చలములు యేల రేఁచేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంతకెంత చలములు యేల రేఁచేవు చెంతలఁ జనవులిచ్చి చేకొనఁగరాదా (॥ఎంత॥) వద్దనున్న కాంతలను వాసులు వుట్టించితేను పెద్దరికాల కెంతైనాఁ బెనఁగుదురు బుద్దిచెప్పి తగవులు దిద్దదొరకొంటేను ఇద్దరూఁ దమమాట లెన్నైనాఁ జెప్పుదురు (॥ఎంత॥) సవతులైనవారి సారెఁ బంతా లెక్కించితే జవళితో సణఁగులు చల్లుదురు తవిలి వొద్దని మరి తగఁ జేతఁబట్టితేను తివురుచు మీఁదమీఁద దీకొనఁగఁజూతురు (॥ఎంత॥) యెట్టనెదిటివారి నెడమాట లాడితేను పెట్టరాని వొట్లెల్లాఁ బెట్టుకొందురు ఇట్టె శ్రీవేంకటేశ యే నలమేలుమంగను గుట్టున నన్నేలితి వాకొమ్మలాఁ గూడరాదా English(||pallavi||) ĕṁtagĕṁta salamulu yela rem̐sevu sĕṁtalam̐ janavulichchi segŏnam̐garādā (||ĕṁta||) vaddanunna kāṁtalanu vāsulu vuṭṭiṁchidenu pĕddarigāla kĕṁtainām̐ bĕnam̐guduru buddisĕppi tagavulu diddadŏragŏṁṭenu iddarūm̐ damamāḍa lĕnnainām̐ jĕppuduru (||ĕṁta||) savadulainavāri sārĕm̐ baṁtā lĕkkiṁchide javaḽido saṇam̐gulu salluduru tavili vŏddani mari tagam̐ jedam̐baṭṭidenu tivurusu mīm̐damīm̐da dīgŏnam̐gam̐jūduru (||ĕṁta||) yĕṭṭanĕdiḍivāri nĕḍamāḍa lāḍidenu pĕṭṭarāni vŏṭlĕllām̐ bĕṭṭugŏṁduru iṭṭĕ śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu guṭṭuna nannelidi vāgŏmmalām̐ gūḍarādā