Title (Indic)ఎంత చనవిచ్చితివి యీపెకు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంత చనవిచ్చితివి యీపెకు నీవు వంతులకు వట్టి వళావళ్ళు సేసీనిపుడు (॥ఎంత॥) పవళించి నీవుండఁగా పడఁతికొలువులోన చెవిలోన విన్నపాలు సేసీనీకె తవిలి యొకతెపై పాదము నీవు చాఁచఁగాను తివిరి వేళ్ళ చిటికె దియ్యవచ్చీ నీకును (॥ఎంత॥) వెలఁదులచే నీవు వీణె వాయింపించుకోఁగా కిలకిల నవ్వు నవ్వి కెలసీనీపె నెలవుగాఁ గప్పురము నీవొకతెకియ్యఁగాను తొలుత నడుముదూరి దోసిలొగ్గీనిపుడు (॥ఎంత॥) అడపపుటింతిచేత ఆకు నీవందుకోఁగాను వెడఁగుఁదనాన తెర వేసీనీపె అడరి శ్రీ వేంకటేశ అంతలో నన్నేలితివి బడివాయక తాను నీపానుపెక్కేనిపుడు English(||pallavi||) ĕṁta sanavichchidivi yībĕgu nīvu vaṁtulagu vaṭṭi vaḽāvaḽḽu sesīnibuḍu (||ĕṁta||) pavaḽiṁchi nīvuṁḍam̐gā paḍam̐tigŏluvulona sĕvilona vinnabālu sesīnīgĕ tavili yŏgadĕbai pādamu nīvu sām̐sam̐gānu tiviri veḽḽa siḍigĕ diyyavachchī nīgunu (||ĕṁta||) vĕlam̐dulase nīvu vīṇĕ vāyiṁpiṁchugom̐gā kilagila navvu navvi kĕlasīnībĕ nĕlavugām̐ gappuramu nīvŏgadĕgiyyam̐gānu tŏluda naḍumudūri dosilŏggīnibuḍu (||ĕṁta||) aḍababuḍiṁtiseda āgu nīvaṁdugom̐gānu vĕḍam̐gum̐danāna tĕra vesīnībĕ aḍari śhrī veṁkaḍeśha aṁtalo nannelidivi baḍivāyaga tānu nībānubĕkkenibuḍu