Title (Indic)ఎంత సణఁగులు రాల్చే వితనిమీఁద WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంత సణఁగులు రాల్చే వితనిమీఁద చెంత నిన్నుఁ గూడి పచ్చిసేయ కేల మానునే (॥ఎంత॥) పలుకులఁ గొసరుతా పయ్యదను విసరుతా చిలుకుగోరికొనలఁజిమ్ముతాను యెలయించి రమణునికేల వొడ్డించుకొనేవే బలునీచన్ను లాతఁడు పట్టితే నేమాయనే (॥ఎంత॥) బొమ్మల జంకించుతాను పొంచి యానలు వెట్టుతా పమ్ముఁజూపుపంతాలు పచారించుతా యెమ్మెలకు నాతనితోనేల సాములుసేసేవే నిమ్మపంట వేసితేను నీకేమాయనే (॥ఎంత॥) ఆయములు దాఁకించుతా నంటిముట్టి పెనఁగుతా చాయల సన్నల నిన్ను సాదించుతాను పాయ కలమేలుమంగపతి శ్రీవేంకటేశుఁడు యీయెడ నిన్నేలి చనవిచ్చితే నేమాయనే English(||pallavi||) ĕṁta saṇam̐gulu rālse vidanimīm̐da sĕṁta ninnum̐ gūḍi pachchiseya kela mānune (||ĕṁta||) palugulam̐ gŏsarudā payyadanu visarudā silugugorigŏnalam̐jimmudānu yĕlayiṁchi ramaṇunigela vŏḍḍiṁchugŏneve balunīsannu lādam̐ḍu paṭṭide nemāyane (||ĕṁta||) bŏmmala jaṁkiṁchudānu pŏṁchi yānalu vĕṭṭudā pammum̐jūbubaṁtālu pasāriṁchudā yĕmmĕlagu nādanidonela sāmuluseseve nimmabaṁṭa vesidenu nīgemāyane (||ĕṁta||) āyamulu dām̐kiṁchudā naṁṭimuṭṭi pĕnam̐gudā sāyala sannala ninnu sādiṁchudānu pāya kalamelumaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu yīyĕḍa ninneli sanavichchide nemāyane