Title (Indic)ఎంత మీఁదుకట్టెనో యింతి నీకు జవ్వనము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంత మీఁదుకట్టెనో యింతి నీకు జవ్వనము కాంతుఁడ వేమి సేసితో కానుక లంపెఁ జెలి (॥ఎంత॥) నిద్దిరించవలసినా నీకాఁగిటనే కాని వొద్ద నిన్నుఁ బాసి వొంటినొల్లదు చెలి కొద్దిగా మాఁటాడినాను కోరి నీతోనేకాని ముద్దిరించి పరులతో మోనమే చెలి (॥ఎంత॥) ఆరగించవలసినా అటు నీపొత్తునఁగాని వూరకే వేరెయైతే నొల్లదు చెలి సారె విడెమిచ్చినాను సగమాకు నీ కియ్యక చేరి వేరేతమ్ములము చేయదు చెలి (॥ఎంత॥) కొమ్మ పయ్యద గప్పినాఁగూడ నీతోఁగాని వుమ్మడిఁ దనంతనై తే నొల్లదు చెలి యిమ్ముల శ్రీవేంకటేశ యింతలోఁ గూడితిఁగాని బమ్మర వెట్టినా నీకుఁ బాయదు చెలి English(||pallavi||) ĕṁta mīm̐dugaṭṭĕno yiṁti nīgu javvanamu kāṁtum̐ḍa vemi sesido kānuga laṁpĕm̐ jĕli (||ĕṁta||) niddiriṁchavalasinā nīgām̐giḍane kāni vŏdda ninnum̐ bāsi vŏṁṭinŏlladu sĕli kŏddigā mām̐ṭāḍinānu kori nīdonegāni muddiriṁchi parulado moname sĕli (||ĕṁta||) āragiṁchavalasinā aḍu nībŏttunam̐gāni vūrage verĕyaide nŏlladu sĕli sārĕ viḍĕmichchinānu sagamāgu nī kiyyaga seri veredammulamu seyadu sĕli (||ĕṁta||) kŏmma payyada gappinām̐gūḍa nīdom̐gāni vummaḍim̐ danaṁtanai te nŏlladu sĕli yimmula śhrīveṁkaḍeśha yiṁtalom̐ gūḍidim̐gāni bammara vĕṭṭinā nīgum̐ bāyadu sĕli