Title (Indic)ఎంత మన్నించెనే నన్ను నితఁడు నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంత మన్నించెనే నన్ను నితఁడు నేఁడు వింతలు లోకానకెల్లా వెగ్గళములే (॥॥) యేకతానఁ దా బెట్టిన వెటువంటివో ఆనలు వాకుచ్చేనంటే నావసము గాదే చేకొని యప్పడు నాకు జెప్పినట్టి ప్రియములు దాకొని రట్టు సేయఁగఁ దగవు గాదే (॥॥) తానే మాయింటికి వచ్చి తగనిచ్చి యీవులు పానిపట్టి యెక్కడాఁ జూపఁగరానివే నానావిధముల నాతో నవ్వినట్టి నవ్వులు తానకమై మతిలోన దాఁచ వలెనే (॥॥) యిప్పుడే శ్రీవేంకటేశుఁ డెనసిన కూటములు చిప్పలి నా మైనుండఁగ సిగ్గులయ్యీనే ముప్పురి నామీఁద నిట్టే ముంచినట్టి మోహములు వొప్పుగా నాజవ్వనాన కుంకువాయనే English(||pallavi||) ĕṁta manniṁchĕne nannu nidam̐ḍu nem̐ḍu viṁtalu logānagĕllā vĕggaḽamule (||||) yegadānam̐ dā bĕṭṭina vĕḍuvaṁṭivo ānalu vāguchchenaṁṭe nāvasamu gāde segŏni yappaḍu nāgu jĕppinaṭṭi priyamulu dāgŏni raṭṭu seyam̐gam̐ dagavu gāde (||||) tāne māyiṁṭigi vachchi taganichchi yīvulu pānibaṭṭi yĕkkaḍām̐ jūbam̐garānive nānāvidhamula nādo navvinaṭṭi navvulu tānagamai madilona dām̐sa valĕne (||||) yippuḍe śhrīveṁkaḍeśhum̐ ḍĕnasina kūḍamulu sippali nā mainuṁḍam̐ga siggulayyīne muppuri nāmīm̐da niṭṭe muṁchinaṭṭi mohamulu vŏppugā nājavvanāna kuṁkuvāyane