Title (Indic)ఎంత కెంత సేసేవే ఇందుకుఁగాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంత కెంత సేసేవే ఇందుకుఁగాను పంతము లాడితేనే పైకొని మన్నించఁడా (॥॥) పిలిచి యాతఁడు నీకుఁ బ్రియములు చెప్పఁగాను చలము లేమిటికి జన్వనివి మొలకచన్నులనీ మొన లురమునఁ బెట్టి బలిమి చూపితే నీకుఁబంపు సేయఁడా (॥॥) నగుతా నీతఁడు నీలో ననుపు నటించఁగాను బిగియనేమిటికి పిన్నదానవు వొగరుమోవితేనె లొద్దికఁజవులు నించి తగవులు చూపితే చెంత నిన్ను మెప్పించఁడా (॥॥) అంకెల శ్రీవేంకటేశుఁడట్టె నిన్నుఁ గూడఁగాను మంకులేఁటికి పట్టపుమగువవు పొంకపుఁగాఁగాఁగిటిలో నీపొందులు సతముచేసి వుంకువఁ జొక్కించితివి వొరపు మరుగఁడా English(||pallavi||) ĕṁta kĕṁta seseve iṁdugum̐gānu paṁtamu lāḍidene paigŏni manniṁcham̐ḍā (||||) pilisi yādam̐ḍu nīgum̐ briyamulu sĕppam̐gānu salamu lemiḍigi janvanivi mŏlagasannulanī mŏna luramunam̐ bĕṭṭi balimi sūbide nīgum̐baṁpu seyam̐ḍā (||||) nagudā nīdam̐ḍu nīlo nanubu naḍiṁcham̐gānu bigiyanemiḍigi pinnadānavu vŏgarumovidenĕ lŏddigam̐javulu niṁchi tagavulu sūbide sĕṁta ninnu mĕppiṁcham̐ḍā (||||) aṁkĕla śhrīveṁkaḍeśhum̐ḍaṭṭĕ ninnum̐ gūḍam̐gānu maṁkulem̐ṭigi paṭṭabumaguvavu pŏṁkabum̐gām̐gām̐giḍilo nībŏṁdulu sadamusesi vuṁkuvam̐ jŏkkiṁchidivi vŏrabu marugam̐ḍā