Title (Indic)ఎంత బలువె తన కెంత నేము సదరమా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంత బలువె తన కెంత నేము సదరమా అంతే పో తనసుద్దు లవి నే మెరఁగమా (॥ఎంత॥) రమ్మని చేరఁ బిలిచీ రా కున్నఁ దనచేతి నిమ్మపంటఁ గొని వేసీనే నన్నును కమ్మటిఁ దప్పక చూచీ కడు నేఁ దల వంచితే అమ్మ మీఁదఁ దిట్టీనే అంతలోనె తానూ (॥ఎంత॥) చేయి చాఁచీ నామీఁద సిగ్గున నూర కుండితే చాయలకుఁ బన్నీరు చల్లీనే వీఁడూ ఆయములు దా నంటఁగ నందుకు నేఁబెనఁగితే బాయిట వొట్టు వెట్టీనే పాయ లేక తానూ (॥ఎంత॥) కొంగు వట్టి తియ్యఁగాను గుట్టున నే నవ్వితేను అంగవించి యట్టె కూడె నందుకే తానూ యింగితము శ్రీవెంకటేశుఁ డితఁడే యెఱంగు చెంగట నన్నిటికిని చెక్కు నొక్కీఁ దానూ English(||pallavi||) ĕṁta baluvĕ tana kĕṁta nemu sadaramā aṁte po tanasuddu lavi ne mĕram̐gamā (||ĕṁta||) rammani seram̐ bilisī rā kunnam̐ danasedi nimmabaṁṭam̐ gŏni vesīne nannunu kammaḍim̐ dappaga sūsī kaḍu nem̐ dala vaṁchide amma mīm̐dam̐ diṭṭīne aṁtalonĕ tānū (||ĕṁta||) seyi sām̐sī nāmīm̐da sigguna nūra kuṁḍide sāyalagum̐ bannīru sallīne vīm̐ḍū āyamulu dā naṁṭam̐ga naṁdugu nem̐bĕnam̐gide bāyiḍa vŏṭṭu vĕṭṭīne pāya lega tānū (||ĕṁta||) kŏṁgu vaṭṭi tiyyam̐gānu guṭṭuna ne navvidenu aṁgaviṁchi yaṭṭĕ kūḍĕ naṁduge tānū yiṁgidamu śhrīvĕṁkaḍeśhum̐ ḍidam̐ḍe yĕṟaṁgu sĕṁgaḍa nanniḍigini sĕkku nŏkkīm̐ dānū