Title (Indic)ఏమిటికి వెరవవు యెంత గట్టువాయవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమిటికి వెరవవు యెంత గట్టువాయవు బూమె లింత నేరకుంటే పొద్దెట్టు వేఁగీని (॥ఏమి॥) సొలసి నిన్ను నేఁ జూచి చొప్పులెల్లా నెత్తితేను వలపు చల్లితినంటా వడి నవ్వేవు తలపోసి నీచేఁతలు తారుకాణ చేసితేను నలి నిజమాడేనంటా నన్ను మెచ్చేవు (॥ఏమి॥) శిరసు ముట్టఁగా, నేను చేత నిన్నుఁ దోసితేను సరసమాడితినంటా చనవిచ్చేవు తెరవేసుకొని వొంటిఁ దేఁకువతో నుండితేను సరవిఁ గూడఁ బిలిచే సన్న లనేవు (॥ఏమి॥) దగ్గరఁ గూచుండి నేను తలవంచుకుండితేను సిగ్గువడివున్నదంటాఁ జెప్పుకొనేవు యెగ్గులేక శ్రీవేంకటేశ కాఁగిలించుకొంటే బెగ్గిల నీరతుల మెప్పించితి ననేవు English(||pallavi||) emiḍigi vĕravavu yĕṁta gaṭṭuvāyavu būmĕ liṁta neraguṁṭe pŏddĕṭṭu vem̐gīni (||emi||) sŏlasi ninnu nem̐ jūsi sŏppulĕllā nĕttidenu valabu sallidinaṁṭā vaḍi navvevu talabosi nīsem̐talu tārugāṇa sesidenu nali nijamāḍenaṁṭā nannu mĕchchevu (||emi||) śhirasu muṭṭam̐gā, nenu seda ninnum̐ dosidenu sarasamāḍidinaṁṭā sanavichchevu tĕravesugŏni vŏṁṭim̐ dem̐kuvado nuṁḍidenu saravim̐ gūḍam̐ bilise sanna lanevu (||emi||) daggaram̐ gūsuṁḍi nenu talavaṁchuguṁḍidenu sigguvaḍivunnadaṁṭām̐ jĕppugŏnevu yĕggulega śhrīveṁkaḍeśha kām̐giliṁchugŏṁṭe bĕggila nīradula mĕppiṁchidi nanevu