Title (Indic)ఏమిటికి నింతేసి యింత కోపఁగలనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమిటికి నింతేసి యింత కోపఁగలనా వోముచుఁ దాఁ గలఁడని వుండేదే చాలదా (॥ఏమిటి॥) యెగసక్కేలకు నేము యిద్దరమూ దగ్గరతే తగవు దేరిచేవాఁడు తానే కదే తెగువలు నెరపఁగా తియ్యనిమాట లాడి వగపులు దీర్చేటివాఁడు దానే కదవే (॥ఏమిటి॥) చయముగ నేను వారు జగడాల నలసితే దయఁ దలఁచేవాఁడు తానే కదే నయ మెఱుఁగనిమమ్ము నంటునఁ జుటాలఁ జేసి ప్రియముచెప్పేటివా డుఁబెరసి తానే కదవే (॥ఏమిటి॥) ఆలరి కోపముతోడ నాపె నేను గొసరితే తాలిమితో నుండేవాఁడు తానే కదే యీవల శ్రీవేంకటేశుఁ డిటు మమ్ముఁ గలసెను వాలాయించి పంత మిచ్చేవాఁడు తానే కదవే English(||pallavi||) emiḍigi niṁtesi yiṁta kobam̐galanā vomusum̐ dām̐ galam̐ḍani vuṁḍede sāladā (||emiḍi||) yĕgasakkelagu nemu yiddaramū daggarade tagavu derisevām̐ḍu tāne kade tĕguvalu nĕrabam̐gā tiyyanimāḍa lāḍi vagabulu dīrseḍivām̐ḍu dāne kadave (||emiḍi||) sayamuga nenu vāru jagaḍāla nalaside dayam̐ dalam̐sevām̐ḍu tāne kade naya mĕṟum̐ganimammu naṁṭunam̐ juḍālam̐ jesi priyamusĕppeḍivā ḍum̐bĕrasi tāne kadave (||emiḍi||) ālari kobamudoḍa nābĕ nenu gŏsaride tālimido nuṁḍevām̐ḍu tāne kade yīvala śhrīveṁkaḍeśhum̐ ḍiḍu mammum̐ galasĕnu vālāyiṁchi paṁta michchevām̐ḍu tāne kadave