Title (Indic)ఏమిటికే వున్నవెల్ల నింత చాలదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమిటికే వున్నవెల్ల నింత చాలదా ప్రేమమే కడకు నాపైఁ బెంచె నిది చాలదా (॥ఏమి॥) తలఁపులోఁ దనరూపు తలఁచఁగ దలఁచఁగ యెలమి మెయి చెమరించె నిది చాలదా వెలి దనగుణములు వినఁగ వినఁగ నాకు నిలువెల్లఁ బులికించె నేఁడే చాలదా (॥ఏమి॥) యింగితానఁ దనకు నే నెదురుచూడఁ జూడఁగ అంగమెల్లఁ గాఁకరేఁగె నది చాలదా చంగనఁ దాఁ బవ్వళించేశయ్యపైఁ బొరలితే రంగుగాఁ గళలు దాఁకె రతి నది చాలదా (॥ఏమి॥) తాను నేను నంతవింత దగ్గరఁగ దగ్గరఁగ ఆనకమై నవ్వువచ్చీ నది చాలదా వూనిన శ్రీవేంకటేశుఁ డొద్దికతో నన్నుఁ గూడె యీనేటిసంపదలెల్ల నిచ్చె నది చాలదా English(||pallavi||) emiḍige vunnavĕlla niṁta sāladā premame kaḍagu nābaim̐ bĕṁchĕ nidi sāladā (||emi||) talam̐pulom̐ danarūbu talam̐sam̐ga dalam̐sam̐ga yĕlami mĕyi sĕmariṁchĕ nidi sāladā vĕli danaguṇamulu vinam̐ga vinam̐ga nāgu niluvĕllam̐ buligiṁchĕ nem̐ḍe sāladā (||emi||) yiṁgidānam̐ danagu ne nĕdurusūḍam̐ jūḍam̐ga aṁgamĕllam̐ gām̐karem̐gĕ nadi sāladā saṁganam̐ dām̐ bavvaḽiṁcheśhayyabaim̐ bŏralide raṁgugām̐ gaḽalu dām̐kĕ radi nadi sāladā (||emi||) tānu nenu naṁtaviṁta daggaram̐ga daggaram̐ga ānagamai navvuvachchī nadi sāladā vūnina śhrīveṁkaḍeśhum̐ ḍŏddigado nannum̐ gūḍĕ yīneḍisaṁpadalĕlla nichchĕ nadi sāladā