Title (Indic)ఏమి సేసు నాతఁడు యెందరికని వోవును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమి సేసు నాతఁడు యెందరికని వోవును నేమములు నేర్పకురే నెలఁతలాల (॥ఏమి॥) అక్కడనుండి వచ్చి ఆ పరాకై వున్నాఁడేమో కక్కసించకురే వో కాంతలాల నెక్కొని యలసి వచ్చి నిద్దురతో నున్నాడేమో పక్కన లేపకురే పడఁతులాల (॥ఏమి॥) వలపు చపుల సోఁకి వడిఁ జొక్కివున్నాఁడేమో బలిమిసేయకురే భామలాల యెలమి నాపెకు బాస ఇచ్చి వచ్చినాఁడేమో చలము సాదింకురే జలజాక్షులాల (॥ఏమి॥) తగిలి వారిరూపులు తలఁచుకొనీనో యేమో అగడుసేయకురే యంగనలాల జిగి శ్రీవేంకటేశుఁడు సింగారవనములోన నగి కూడెఁ గోనేటిలో నన్ను నింతులాల English(||pallavi||) emi sesu nādam̐ḍu yĕṁdarigani vovunu nemamulu nerbagure nĕlam̐talāla (||emi||) akkaḍanuṁḍi vachchi ā parāgai vunnām̐ḍemo kakkasiṁchagure vo kāṁtalāla nĕkkŏni yalasi vachchi niddurado nunnāḍemo pakkana lebagure paḍam̐tulāla (||emi||) valabu sabula som̐ki vaḍim̐ jŏkkivunnām̐ḍemo balimiseyagure bhāmalāla yĕlami nābĕgu bāsa ichchi vachchinām̐ḍemo salamu sādiṁkure jalajākṣhulāla (||emi||) tagili vārirūbulu talam̐sugŏnīno yemo agaḍuseyagure yaṁganalāla jigi śhrīveṁkaḍeśhum̐ḍu siṁgāravanamulona nagi kūḍĕm̐ goneḍilo nannu niṁtulāla