Title (Indic)ఏమి సేసేవో చూతము యెవ్వరు బలువో మీలో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమి సేసేవో చూతము యెవ్వరు బలువో మీలో నా మొగము చూచి నీవు నవ్వులు నవ్వేవు (॥ఏమి॥) ముంచి ముంచి తేనెగారేమోవినే మాటలాడి పంచనుండే యాపె నిన్ను భ్రమయించెఁగా కొంచెముగా నవ్వి పెద్దకొప్పు నీకు జూపిచూపి వంచనతో నీకు మొక్కి వలపించెఁగా (॥ఏమి॥) పట్టెఁడేసిగుబ్బలపై పయ్యదించుక జారించి బెట్టుగా సరసాలాడి బెల్లించెఁగా గుట్టుతోఁ దప్పకచూచి గోరుసొఁక విడెమిచ్చి చుట్టపుఁదనాల నిన్నుఁ జోక్కించెఁగా (॥ఏమి॥) చెయ్యారా సన్నలు సేసి సేసలు నీపైఁ జల్లి తియ్యఁదనాలఁ దెప్పలఁ దేలించెఁగా ఇయ్యెడ శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ నెయ్యాన నన్నేలితివి నీ కప్పణ ఇచ్చెఁగా English(||pallavi||) emi sesevo sūdamu yĕvvaru baluvo mīlo nā mŏgamu sūsi nīvu navvulu navvevu (||emi||) muṁchi muṁchi tenĕgāremovine māḍalāḍi paṁchanuṁḍe yābĕ ninnu bhramayiṁchĕm̐gā kŏṁchĕmugā navvi pĕddagŏppu nīgu jūbisūbi vaṁchanado nīgu mŏkki valabiṁchĕm̐gā (||emi||) paṭṭĕm̐ḍesigubbalabai payyadiṁchuga jāriṁchi bĕṭṭugā sarasālāḍi bĕlliṁchĕm̐gā guṭṭudom̐ dappagasūsi gorusŏm̐ka viḍĕmichchi suṭṭabum̐danāla ninnum̐ jokkiṁchĕm̐gā (||emi||) sĕyyārā sannalu sesi sesalu nībaim̐ jalli tiyyam̐danālam̐ dĕppalam̐ deliṁchĕm̐gā iyyĕḍa śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga nĕyyāna nannelidivi nī kappaṇa ichchĕm̐gā