Title (Indic)ఏమి సేసెనే విభుఁడు యేఁటికి వేగిరించేవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమి సేసెనే విభుఁడు యేఁటికి వేగిరించేవే భామిని మీల పిల్లలఁ బాలువోసి పెంతురా (॥ఏమి॥) ఇంతేసి జక్కవలను యేల గూఁట వేసేవే పంతపు వాఁడమ్ములేల పారాడించేవే కాంతుల యద్దములను కవిసెనఁబెట్టనేలే వింతగాఁ దుమ్మిదపిండు విరియించ నేఁటికే (॥ఏమి॥) చిగురుటాకుల తేనె చిందనేల పోసేవే మొగిచి పట్టఁగనేలే ముంపుఁదీగెలు యెగసక్కేనకు బయలేల ముడివేసేవే జగతిఁ గరికుంభాలు సారెకునూఁదుదురా (॥ఏమి॥) బలిమినరంట్లను పక్కనఁ బైఁ దోయనేలే అలమి యంచులఁ బాతురాడింతురా అలమేలుమంగవు నీ వాతఁడు శ్రీ వేంకటేశుఁ డెలమిఁ గూడితిరి మిక్కిలియే వేడుకలా English(||pallavi||) emi sesĕne vibhum̐ḍu yem̐ṭigi vegiriṁcheve bhāmini mīla pillalam̐ bāluvosi pĕṁturā (||emi||) iṁtesi jakkavalanu yela gūm̐ṭa veseve paṁtabu vām̐ḍammulela pārāḍiṁcheve kāṁtula yaddamulanu kavisĕnam̐bĕṭṭanele viṁtagām̐ dummidabiṁḍu viriyiṁcha nem̐ṭige (||emi||) siguruḍāgula tenĕ siṁdanela poseve mŏgisi paṭṭam̐ganele muṁpum̐dīgĕlu yĕgasakkenagu bayalela muḍiveseve jagadim̐ gariguṁbhālu sārĕgunūm̐dudurā (||emi||) baliminaraṁṭlanu pakkanam̐ baim̐ doyanele alami yaṁchulam̐ bādurāḍiṁturā alamelumaṁgavu nī vādam̐ḍu śhrī veṁkaḍeśhum̐ ḍĕlamim̐ gūḍidiri mikkiliye veḍugalā