Title (Indic)ఏమి చెప్పేరే బుద్దులు ఇద్దరు నొక్కటే తాము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమి చెప్పేరే బుద్దులు ఇద్దరు నొక్కటే తాము సాములెంత సేసినాను చనవులై వుండు (॥ఏమి॥) చెలువపురమణుఁడు సేఁత లేమిసేసినాను యెలమి మోహించునింతికింపులై వుండు తలఁచుకొంటే నవే తగులాయములై వుండు కలిమితో మేనికిసింగారములై వుండు (॥ఏమి॥) ననుపైన నాయకుఁడు నవ్వులెన్ని నవ్వినాను యెనసినకామినికిఇంపులై వుండు తనివోనివేడుకకుఁ దరితీపులై వుండు పెనఁగినప్పుడెల్లాను ప్రియములై వుండు (॥ఏమి॥) యీరీతి శ్రీవేంకటేశుఁ డెంత కాఁగిలించినాను యీరసములెల్లా మాని ఇంపులై వుండు తారుకాణలైవుండు తమకములై వుండు వూరేటియమృతమెల్లా వుట్టిపడివుండు English(||pallavi||) emi sĕppere buddulu iddaru nŏkkaḍe tāmu sāmulĕṁta sesinānu sanavulai vuṁḍu (||emi||) sĕluvaburamaṇum̐ḍu sem̐ta lemisesinānu yĕlami mohiṁchuniṁtigiṁpulai vuṁḍu talam̐sugŏṁṭe nave tagulāyamulai vuṁḍu kalimido menigisiṁgāramulai vuṁḍu (||emi||) nanubaina nāyagum̐ḍu navvulĕnni navvinānu yĕnasinagāminigiiṁpulai vuṁḍu tanivoniveḍugagum̐ daridībulai vuṁḍu pĕnam̐ginappuḍĕllānu priyamulai vuṁḍu (||emi||) yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍĕṁta kām̐giliṁchinānu yīrasamulĕllā māni iṁpulai vuṁḍu tārugāṇalaivuṁḍu tamagamulai vuṁḍu vūreḍiyamṛtamĕllā vuṭṭibaḍivuṁḍu