Title (Indic)ఏమే యిందు కెగ్గు లెంచఁ దగునా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమే యిందు కెగ్గు లెంచఁ దగునా కాముఁడు సేసినయట్టి కత లింతె కాక (॥ఏమే॥) నేనా తనతో నెమ్మిఁ గొసరేదాన తన్నుఁ గానక యెదురుచూచె కన్నులు గాకా కానీ కానిమ్మని కడుఁ బగ చాటితినా వూని జంకించినవె బొమ్మలింతె కాకా (॥ఏమే॥) అలిగి తనతో నే నవ్వలిమో మౌదునా చెలఁగి వంచినది నా సిరసె కాక మలసి తనతోను మాటలాడ కుందునా వెలసిన విరహపు పింతె కాక (॥ఏమే॥) పట్టఁగా నేనా పైకొనకుండేదాన గుట్టుతోడ నుండెటి నా గుణము గాక యిట్టె శ్రీ వెంకటేశుఁ డిన్నిటాను నన్నుఁ గూడె పట్టిన నా నోము ఫల మింతె కాకా English(||pallavi||) eme yiṁdu kĕggu lĕṁcham̐ dagunā kāmum̐ḍu sesinayaṭṭi kada liṁtĕ kāga (||eme||) nenā tanado nĕmmim̐ gŏsaredāna tannum̐ gānaga yĕdurusūsĕ kannulu gāgā kānī kānimmani kaḍum̐ baga sāḍidinā vūni jaṁkiṁchinavĕ bŏmmaliṁtĕ kāgā (||eme||) aligi tanado ne navvalimo maudunā sĕlam̐gi vaṁchinadi nā sirasĕ kāga malasi tanadonu māḍalāḍa kuṁdunā vĕlasina virahabu piṁtĕ kāga (||eme||) paṭṭam̐gā nenā paigŏnaguṁḍedāna guṭṭudoḍa nuṁḍĕḍi nā guṇamu gāga yiṭṭĕ śhrī vĕṁkaḍeśhum̐ ḍinniḍānu nannum̐ gūḍĕ paṭṭina nā nomu phala miṁtĕ kāgā