Title (Indic)ఏమే యెడమాట లేలాడించే వాతనితో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమే యెడమాట లేలాడించే వాతనితో కామించి నీ పతియున్న కడకు రాఁగదవే (॥ఏమే॥) దాకొని వద్దనుంటే నే తగులౌఁగాక మోహము ఆకడ తెరమాటైతేనందునా పొందు రాక దరచైతే మొకదాకిరి గలుగుఁగాక చేకొని గర్వాననుంటే చిత్తము గరఁగునా (॥ఏమే॥) మాటలాడుతానుంటేనే మర్మములు సోఁకుఁగాక నీటున మోనాననుంటే నిండునా తమి కూటమికిఁ బెనఁగితే కొనసాగుఁగాక రతి జూటుఁదనానఁ గొంకితే చుట్టరిక మబ్బునా (॥ఏమే॥) పట్టి కాఁగితించితేనే పచ్చిసిగ్గు దేరుఁగాక గుట్టున నెంత వుండినా కోరినట్టౌనా ఇట్టెశ్రీవేంకటేశుఁ డేలెఁగాక నిన్ను నేఁడు జట్టి గొనకుండితేను చవులు రెట్టించునా English(||pallavi||) eme yĕḍamāḍa lelāḍiṁche vādanido kāmiṁchi nī padiyunna kaḍagu rām̐gadave (||eme||) dāgŏni vaddanuṁṭe ne tagulaum̐gāga mohamu āgaḍa tĕramāḍaidenaṁdunā pŏṁdu rāga darasaide mŏgadāgiri galugum̐gāga segŏni garvānanuṁṭe sittamu garam̐gunā (||eme||) māḍalāḍudānuṁṭene marmamulu som̐kum̐gāga nīḍuna monānanuṁṭe niṁḍunā tami kūḍamigim̐ bĕnam̐gide kŏnasāgum̐gāga radi jūḍum̐danānam̐ gŏṁkide suṭṭariga mabbunā (||eme||) paṭṭi kām̐gidiṁchidene pachchisiggu derum̐gāga guṭṭuna nĕṁta vuṁḍinā korinaṭṭaunā iṭṭĕśhrīveṁkaḍeśhum̐ ḍelĕm̐gāga ninnu nem̐ḍu jaṭṭi gŏnaguṁḍidenu savulu rĕṭṭiṁchunā