Title (Indic)ఎందుకుఁ బనిగొందము యేమి సేతమివి యెల్లా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎందుకుఁ బనిగొందము యేమి సేతమివి యెల్లా చెందిన మాకిఁక బుద్ధి చెప్పవే నారాయణా (॥ఎందు॥) హరినామ మొకటనే అణఁగెఁ బాపములు వొరసి యన్నినామము లూరకున్నవి సిరులిచ్చెఁ గలవెల్లా శ్రీపతినామ మొకటే పెరనామములెల్లా పెట్టెలలో నున్నవి (॥ఎందు॥) గోవిందనామ మొకటే కూడపోసెఁ బుణ్యములు వేవేలు నామములకు వెలలున్నవా శ్రీవిష్ణునామ మొకటే చేతికిచ్చె వైకుంఠము తావైయున్న నామములు తమకించీ నీవికి (॥ఎందు॥) ఇత్తల కేశవునామ మియ్యఁగలవెల్లా నిచ్చె పొత్తుల నామములెల్లాఁ బొంచుకున్నవి చిత్తమున నిన్నుఁ జూపె శ్రీవేంకటేశ నామమే హత్తిన నామములెల్లా నందులోనే వున్నవి English(||pallavi||) ĕṁdugum̐ banigŏṁdamu yemi sedamivi yĕllā sĕṁdina māgim̐ka buddhi sĕppave nārāyaṇā (||ĕṁdu||) harināma mŏgaḍane aṇam̐gĕm̐ bābamulu vŏrasi yannināmamu lūragunnavi sirulichchĕm̐ galavĕllā śhrībadināma mŏgaḍe pĕranāmamulĕllā pĕṭṭĕlalo nunnavi (||ĕṁdu||) goviṁdanāma mŏgaḍe kūḍabosĕm̐ buṇyamulu vevelu nāmamulagu vĕlalunnavā śhrīviṣhṇunāma mŏgaḍe sedigichchĕ vaiguṁṭhamu tāvaiyunna nāmamulu tamagiṁchī nīvigi (||ĕṁdu||) ittala keśhavunāma miyyam̐galavĕllā nichchĕ pŏttula nāmamulĕllām̐ bŏṁchugunnavi sittamuna ninnum̐ jūbĕ śhrīveṁkaḍeśha nāmame hattina nāmamulĕllā naṁdulone vunnavi