Title (Indic)ఎందరు చుట్టాలు గల్లా నింతకు మేలే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎందరు చుట్టాలు గల్లా నింతకు మేలే అందుకోలు వలపుల కంగవించేఁ గాక (॥ఎంద॥) బత్తిసేసీనాపె నీపై పరాకుసేయకువయ్య చిత్తములోఁ గల మాటే చెప్పే నీకు హత్తినేను వద్దనుండ యందుకింత సేయనేల సత్తుగా నే వద్దనేలా సంతోషించేఁ గాక (॥ఎంద॥) ఇచ్చకముసేసీనాపె యేల వూరకున్నాఁడవు చెచ్చెరఁ జేసేమాటే చెప్పే నీకు ముచ్చట నేనెరిఁగితే మూసిదాఁచనింతయాల మచ్చికలేమి గల్లాను మరిమెచ్చేఁ గాక (॥ఎంద॥) కలసిపెనఁగీనాపె కడమలేల పెట్టేవు చెలిమికత్తెల సుద్ది చెప్పే నీకు యెలమి శ్రీ వెంకటేశ యీడనున్నఁ గూడితివి నలువంకమేకులకు నవ్వు నవ్వేఁ గాక English(||pallavi||) ĕṁdaru suṭṭālu gallā niṁtagu mele aṁdugolu valabula kaṁgaviṁchem̐ gāga (||ĕṁda||) battisesīnābĕ nībai parāguseyaguvayya sittamulom̐ gala māḍe sĕppe nīgu hattinenu vaddanuṁḍa yaṁdugiṁta seyanela sattugā ne vaddanelā saṁtoṣhiṁchem̐ gāga (||ĕṁda||) ichchagamusesīnābĕ yela vūragunnām̐ḍavu sĕchchĕram̐ jesemāḍe sĕppe nīgu muchchaḍa nenĕrim̐gide mūsidām̐saniṁtayāla machchigalemi gallānu marimĕchchem̐ gāga (||ĕṁda||) kalasibĕnam̐gīnābĕ kaḍamalela pĕṭṭevu sĕlimigattĕla suddi sĕppe nīgu yĕlami śhrī vĕṁkaḍeśha yīḍanunnam̐ gūḍidivi naluvaṁkamegulagu navvu navvem̐ gāga