Title (Indic)ఎండగాదు నీడగాదు యెక్కువ నీ పొందులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎండగాదు నీడగాదు యెక్కువ నీ పొందులు బండుబండులైతి నింకఁ బడలేనురా (॥ఎండ॥) పచ్చిగారు వెచ్చిగాదు పాయపునీసేఁతలు ఇచ్చట నే మొకమోట నేమందురా వెచ్చనాయ పచ్చనాయ వెడ నీమేను నీమోవి రచ్చలకెక్కె వలపు రాకు రాకురా (॥ఎండ॥) వేండ్లాయ వాండ్లాయ వెడద నీచూపులు యేండ్లాయ నిమిషము లేమిసేతురా ఆండ్లైరి గోపసతులంటావే బిగిసేవు వీండ్లవాండ్లమాటలు వినలేనురా (॥ఎండ॥) అంకెలాయ లంకెలాయ అందపు నీకాగిఁలి యింక నిన్ను వీడనాడ యేడకేడరా తెంకినే శ్రీవేంకటశ తేజముతోఁ గూడితవి మంకులనీగుణ మింక మానుమానురా English(||pallavi||) ĕṁḍagādu nīḍagādu yĕkkuva nī pŏṁdulu baṁḍubaṁḍulaidi niṁkam̐ baḍalenurā (||ĕṁḍa||) pachchigāru vĕchchigādu pāyabunīsem̐talu ichchaḍa ne mŏgamoḍa nemaṁdurā vĕchchanāya pachchanāya vĕḍa nīmenu nīmovi rachchalagĕkkĕ valabu rāgu rāgurā (||ĕṁḍa||) veṁḍlāya vāṁḍlāya vĕḍada nīsūbulu yeṁḍlāya nimiṣhamu lemisedurā āṁḍlairi gobasadulaṁṭāve bigisevu vīṁḍlavāṁḍlamāḍalu vinalenurā (||ĕṁḍa||) aṁkĕlāya laṁkĕlāya aṁdabu nīgāgim̐li yiṁka ninnu vīḍanāḍa yeḍageḍarā tĕṁkine śhrīveṁkaḍaśha tejamudom̐ gūḍidavi maṁkulanīguṇa miṁka mānumānurā