Title (Indic)ఏమయ్యా పాడిపంతా తెఱఁగనివా నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమయ్యా పాడిపంతా తెఱఁగనివా నీవు నేమముతో నిద్దరును నీకు సరిగారా (॥ఏమ॥) పనివడి యాపె నీతో పంతములెల్లా నాడఁగా వొనరి యీపె నీతో నూరకుండువా చనవుచేసుక యాపె సంగడిఁగూచుండఁగాను వెనకదిక్కున నీకె వేరె కూచుండునా (॥ఏమ॥) చెంతనుండి యాపె నీకు సేవలెల్లాఁ జేయఁగాను ఇంత నంతఁ గొలువులు యీకె సేసునా మంతనాన ఆపె నీమర్మము లంటఁగాను వింతకతలు చెప్పునా వెలఁది యీకె (॥ఏమ॥) పొత్తుల రతులనాకె భోగించఁగా నీకు బత్తులే సేసునా పైపై నీకె కొత్తగా శ్రీవేంకటేశ కూడె నాకెనిన్నుఁ దొల్లె వుత్తలపు వేడుకల నురమెక్కెనీకె English(||pallavi||) emayyā pāḍibaṁtā tĕṟam̐ganivā nīvu nemamudo niddarunu nīgu sarigārā (||ema||) panivaḍi yābĕ nīdo paṁtamulĕllā nāḍam̐gā vŏnari yībĕ nīdo nūraguṁḍuvā sanavusesuga yābĕ saṁgaḍim̐gūsuṁḍam̐gānu vĕnagadikkuna nīgĕ verĕ kūsuṁḍunā (||ema||) sĕṁtanuṁḍi yābĕ nīgu sevalĕllām̐ jeyam̐gānu iṁta naṁtam̐ gŏluvulu yīgĕ sesunā maṁtanāna ābĕ nīmarmamu laṁṭam̐gānu viṁtagadalu sĕppunā vĕlam̐di yīgĕ (||ema||) pŏttula radulanāgĕ bhogiṁcham̐gā nīgu battule sesunā paibai nīgĕ kŏttagā śhrīveṁkaḍeśha kūḍĕ nāgĕninnum̐ dŏllĕ vuttalabu veḍugala nuramĕkkĕnīgĕ