Title (Indic)ఏమయ్య నీ సతినఁట యింత వలెనా నాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమయ్య నీ సతినఁట యింత వలెనా నాకు నేమము దప్పకు నేఁడు నీకు నే వెగ్గళమా (॥ఏమ॥) చెప్పినట్టి నీమాట చెవియొగ్గి వింటినిదె యిప్పుడే నన్నుఁ దీయకు మింటిలోనికి ముప్పిరిఁ గస్తూరిబొట్టు ముంజేతుల నంటుదాఁకా అప్పటి మొక్కకు నీకు నడ్డము లాడేనా (॥ఏమ॥) సొరిది నీవిచ్చినట్టి సొమ్ములెల్లాఁ బెట్టుకొంటి పొరిఁ జెంపల గందాలు పుయ్యకు నాకు శిరసు విడినదాఁకా చెక్కు చెమరించుదాఁకా సరివెనఁగకు నీతో చలము సేసేనా (॥ఏమ॥) వలపులు రేఁచఁ గాని వద్దనే కూచున్నదాన తలుపు ముయ్యకు రతితమకానను యెలమి శ్రీవేంకటేశ యిట్టె కూడితి విందాఁకఁ కొలదిఁ మీరితివి నాగుణము మానేనా English(||pallavi||) emayya nī sadinam̐ṭa yiṁta valĕnā nāgu nemamu dappagu nem̐ḍu nīgu ne vĕggaḽamā (||ema||) sĕppinaṭṭi nīmāḍa sĕviyŏggi viṁṭinidĕ yippuḍe nannum̐ dīyagu miṁṭilonigi muppirim̐ gastūribŏṭṭu muṁjedula naṁṭudām̐kā appaḍi mŏkkagu nīgu naḍḍamu lāḍenā (||ema||) sŏridi nīvichchinaṭṭi sŏmmulĕllām̐ bĕṭṭugŏṁṭi pŏrim̐ jĕṁpala gaṁdālu puyyagu nāgu śhirasu viḍinadām̐kā sĕkku sĕmariṁchudām̐kā sarivĕnam̐gagu nīdo salamu sesenā (||ema||) valabulu rem̐sam̐ gāni vaddane kūsunnadāna talubu muyyagu radidamagānanu yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ kūḍidi viṁdām̐kam̐ kŏladim̐ mīridivi nāguṇamu mānenā