Title (Indic)ఏమయ్య కరుణించేది యిఁక నెన్నఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమయ్య కరుణించేది యిఁక నెన్నఁడు చే ముట్టి సరసమాడి చెక్కునొక్కరాదా (॥ఏమ॥) చిప్పిలుఁగాఁకలతోడి సిగ్గులు నీపైఁ జల్లీ కప్పుర మియ్యగఁరాదా కలికికిని రెప్పలెత్తుఁజూపులతో రేసుల నిన్నుఁ గొసరీ దప్పికి మోవియ్యరాదా తరుణికిని (॥ఏమ॥) కొలకొలనవ్వులతో కూరిమి నీపై వేసీ పిలిచి చేకొనరాదా ప్రియురాలిని తొలఁకునాసలతోడ దూరీ నిన్ను సారెకు అలమి చనవీరాదా అంగనకును (॥ఏమ॥) కందువఁ జన్నులు మోపి కళలు నీపై రేఁచీ అంది కాఁగిలించరాదా అతివను చెందెను బలిమిఁ బట్టి శ్రీవేంకటేశ్వర నిన్ను అంది విడెమియ్యరాదా అలివేణికి English(||pallavi||) emayya karuṇiṁchedi yim̐ka nĕnnam̐ḍu se muṭṭi sarasamāḍi sĕkkunŏkkarādā (||ema||) sippilum̐gām̐kaladoḍi siggulu nībaim̐ jallī kappura miyyagam̐rādā kaligikini rĕppalĕttum̐jūbulado resula ninnum̐ gŏsarī dappigi moviyyarādā taruṇigini (||ema||) kŏlagŏlanavvulado kūrimi nībai vesī pilisi segŏnarādā priyurālini tŏlam̐kunāsaladoḍa dūrī ninnu sārĕgu alami sanavīrādā aṁganagunu (||ema||) kaṁduvam̐ jannulu mobi kaḽalu nībai rem̐sī aṁdi kām̐giliṁcharādā adivanu sĕṁdĕnu balimim̐ baṭṭi śhrīveṁkaḍeśhvara ninnu aṁdi viḍĕmiyyarādā aliveṇigi