Title (Indic)ఏమనేమయ్యా నీవు యెఱఁగని పని లేదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమనేమయ్యా నీవు యెఱఁగని పని లేదు కోమలి కొప్పంటేవు కొంకక నాయెదుట (॥ఏమ॥) యెఱఁగమి సేసుకొని యెంతవున్నా నెఱఁగవు వెఱవక మాటాడేవు వెలఁదితోను వొఱిమ గలదాననై వోరిచినా నెఱఁగవు మఱి సరసమాడేవు మలసి నాయెదుట (॥ఏమ॥) అనఁజాలక కోపమణఁచినా నెఱఁగవు పెనఁగేవాపెచన్నుల బెడిదముగా వెనక మొకమాటాన వేఁడుకొన్నా నెఱఁగవు చెనకేవు కొనగోరఁ జెలితో నాయెదుట (॥ఏమ॥) ప్రియపడి కాఁగిట బిగించినా నెఱఁగవు క్రియతోడ నాపెదిక్కే చూచేవు నియతి శ్రీవేంకటేశ నేనలమేలుమంగను దయఁ గూడితి వాపెకు దక్కేవునాయెదుట English(||pallavi||) emanemayyā nīvu yĕṟam̐gani pani ledu komali kŏppaṁṭevu kŏṁkaga nāyĕduḍa (||ema||) yĕṟam̐gami sesugŏni yĕṁtavunnā nĕṟam̐gavu vĕṟavaga māḍāḍevu vĕlam̐didonu vŏṟima galadānanai vorisinā nĕṟam̐gavu maṟi sarasamāḍevu malasi nāyĕduḍa (||ema||) anam̐jālaga kobamaṇam̐sinā nĕṟam̐gavu pĕnam̐gevābĕsannula bĕḍidamugā vĕnaga mŏgamāḍāna vem̐ḍugŏnnā nĕṟam̐gavu sĕnagevu kŏnagoram̐ jĕlido nāyĕduḍa (||ema||) priyabaḍi kām̐giḍa bigiṁchinā nĕṟam̐gavu kriyadoḍa nābĕdikke sūsevu niyadi śhrīveṁkaḍeśha nenalamelumaṁganu dayam̐ gūḍidi vābĕgu dakkevunāyĕduḍa