Title (Indic)ఏలోయి సటకాఁడ యెఱఁగనా నీ సుద్దులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏలోయి సటకాఁడ యెఱఁగనా నీ సుద్దులు పోలించి యాపె వలపు పూసేవు నా మీఁదను (॥॥) పువ్వుల చెండున వేసెఁ బొరుగున నుండి చెలి ఇవ్వల నాదిక్కు చూచే వేమీ నీవు నవ్వేవు నీకితవైతే నాచేతి కిటు చూపు నివ్వటిల్ల నిజాలకు నే వేసేఁగాని (॥॥) కుంకుమ నీపైఁ జల్లె కొలువునున్నకాంత అంకెల నాచేయి దట్టే వప్పటి నీవు జంకించే వంతగలితే నింకా నదే నాకు నిమ్మా కొంకుగొసరెల్లాఁ దేర కోరి చల్లే నిపుడు (॥॥) మెచ్చి నిమ్మపంటఁ జిమ్మె మేడమీఁదనున్నసతి కొచ్చి యడిగి కాఁగిటఁ గూడేవు నన్ను పచ్చిగా శ్రీవేంకటేశ బత్తి నాపైఁ గలిగితే మచ్చిక నదె ఇచ్చితే మరివేసే నిన్నును English(||pallavi||) eloyi saḍagām̐ḍa yĕṟam̐ganā nī suddulu poliṁchi yābĕ valabu pūsevu nā mīm̐danu (||||) puvvula sĕṁḍuna vesĕm̐ bŏruguna nuṁḍi sĕli ivvala nādikku sūse vemī nīvu navvevu nīgidavaide nāsedi kiḍu sūbu nivvaḍilla nijālagu ne vesem̐gāni (||||) kuṁkuma nībaim̐ jallĕ kŏluvununnagāṁta aṁkĕla nāseyi daṭṭe vappaḍi nīvu jaṁkiṁche vaṁtagalide niṁkā nade nāgu nimmā kŏṁkugŏsarĕllām̐ dera kori salle nibuḍu (||||) mĕchchi nimmabaṁṭam̐ jimmĕ meḍamīm̐danunnasadi kŏchchi yaḍigi kām̐giḍam̐ gūḍevu nannu pachchigā śhrīveṁkaḍeśha batti nābaim̐ galigide machchiga nadĕ ichchide marivese ninnunu