Title (Indic)ఏలయ్య యింతేసి మమ్ము యిటు రట్టుసేసేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏలయ్య యింతేసి మమ్ము యిటు రట్టుసేసేవు తాలిమితోడుత నీదయలోనివారము (॥ఏల॥) కనుఁగొన చపులనే కరఁగించితిననేవు వినయాలు చెప్పనీకు వింతవారమా పెనఁగి మోవితేనెల పిలిచి విందువేట్టేవు వెనకా ముందరా నీకు వినయాలవారమా (॥ఏల॥) సరుగ మంచముపై నాసలఁ గూచుండుమనేవు సరుకు రాను నీసరివారమా యెరవుసేయక మాతో నేకతములాడేవు అరసి నీకు బుద్దిచెప్పేయంతేసివారమా (॥ఏల॥) కలసిన రతులెల్లా ఘనముగాఁ బొగడేవు తొలుతనే నీకంటె దొడ్డవారమా చెలఁగి శ్రీవేంకటేశ చేకొని కూడితివిట్టే పొలసిన నీవంటి పోలికలవారమా English(||pallavi||) elayya yiṁtesi mammu yiḍu raṭṭusesevu tālimidoḍuda nīdayalonivāramu (||ela||) kanum̐gŏna sabulane karam̐giṁchidinanevu vinayālu sĕppanīgu viṁtavāramā pĕnam̐gi movidenĕla pilisi viṁduveṭṭevu vĕnagā muṁdarā nīgu vinayālavāramā (||ela||) saruga maṁchamubai nāsalam̐ gūsuṁḍumanevu sarugu rānu nīsarivāramā yĕravuseyaga mādo negadamulāḍevu arasi nīgu buddisĕppeyaṁtesivāramā (||ela||) kalasina radulĕllā ghanamugām̐ bŏgaḍevu tŏludane nīgaṁṭĕ dŏḍḍavāramā sĕlam̐gi śhrīveṁkaḍeśha segŏni kūḍidiviṭṭe pŏlasina nīvaṁṭi poligalavāramā