Title (Indic)ఏల రేఁచీ నన్ను నింత యేమనినా వెగటౌను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏల రేఁచీ నన్ను నింత యేమనినా వెగటౌను గాలి మూటగట్టఁబోతే కడు నవ్వుఁబాట్లు (॥॥) మారుమాట లాడఁబోతే మనసునొచ్చీఁదనకు కేరికేరి నవ్వఁబోతే కేరడమౌను తారుకాణించఁగఁబోతే తనకుఁ గొరఁతవచ్చు నేరనైతి నాఁడే నాఁడే నిజము నిష్టూరము (॥॥) కనుఁగవ నవ్వఁబోతే కడువెంగెమౌఁదనకు కొనగోర నంటఁబోతే కోపమునౌను చనవునఁ దిట్టఁబోతే జగడాలు ముదురును వినకున్నాఁజెప్పఁబోతే విందువెట్టీఁ బగలు (॥॥) కదిసి మోవడిగితే గట్లు తనకు రాఁగు పదరి కాఁగిలించితే పచ్చిదేరును అదన శ్రీవేంకటేశుఁ డంగవించి నన్నుఁగూడె అద నెరిఁగినయడు గడుగే నిక్షేపము English(||pallavi||) ela rem̐sī nannu niṁta yemaninā vĕgaḍaunu gāli mūḍagaṭṭam̐bode kaḍu navvum̐bāṭlu (||||) mārumāḍa lāḍam̐bode manasunŏchchīm̐danagu kerigeri navvam̐bode keraḍamaunu tārugāṇiṁcham̐gam̐bode tanagum̐ gŏram̐tavachchu neranaidi nām̐ḍe nām̐ḍe nijamu niṣhṭūramu (||||) kanum̐gava navvam̐bode kaḍuvĕṁgĕmaum̐danagu kŏnagora naṁṭam̐bode kobamunaunu sanavunam̐ diṭṭam̐bode jagaḍālu mudurunu vinagunnām̐jĕppam̐bode viṁduvĕṭṭīm̐ bagalu (||||) kadisi movaḍigide gaṭlu tanagu rām̐gu padari kām̐giliṁchide pachchiderunu adana śhrīveṁkaḍeśhum̐ ḍaṁgaviṁchi nannum̐gūḍĕ ada nĕrim̐ginayaḍu gaḍuge nikṣhebamu