Title (Indic)ఏల నీవు దాఁచేవు యింతలో మాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏల నీవు దాఁచేవు యింతలో మాకు తాలిమి నిలుచు నందు తగులములున్నవి (॥ఏల॥) అంచల మూఁకలలోనున్న అతివపై నీవు గొంత ముంచిన నవ్వులలోన మోహమున్నది తుంచి తుంచి తామెరల తూండ్లు నీవు వేయఁగ వంచిన యాపెచూపుల వలపులునున్నవి (॥ఏల॥) ఆసపడి నీవిప్పుడు అండనుండి యేమేమో సేసిన చేఁతలలోన సిగ్గులున్నవి సేసవెట్టి పువ్వులను చిమ్మిరేఁగ నన్నలను వాసిన యాపెవ్రాలలో వాడికెల్లానున్నది (॥ఏల॥) తోడనె శ్రీ వెంకటేశ దొరసి మీరిద్దరును కూడిన కూటమిలోన గురులున్నవి వాడుదేర నేఁడాపె వంకలొత్తి నీచేతికి వీడెమిచ్చినందులోనే వేడుకెల్లానున్నది English(||pallavi||) ela nīvu dām̐sevu yiṁtalo māgu tālimi nilusu naṁdu tagulamulunnavi (||ela||) aṁchala mūm̐kalalonunna adivabai nīvu gŏṁta muṁchina navvulalona mohamunnadi tuṁchi tuṁchi tāmĕrala tūṁḍlu nīvu veyam̐ga vaṁchina yābĕsūbula valabulununnavi (||ela||) āsabaḍi nīvippuḍu aṁḍanuṁḍi yememo sesina sem̐talalona siggulunnavi sesavĕṭṭi puvvulanu simmirem̐ga nannalanu vāsina yābĕvrālalo vāḍigĕllānunnadi (||ela||) toḍanĕ śhrī vĕṁkaḍeśha dŏrasi mīriddarunu kūḍina kūḍamilona gurulunnavi vāḍudera nem̐ḍābĕ vaṁkalŏtti nīsedigi vīḍĕmichchinaṁdulone veḍugĕllānunnadi