Title (Indic)ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము తక్కక శ్రీపతి నీవే దయఁజూతు గాక (॥ఎక్క॥) కాదనఁగ నెట్టువచ్చు కన్నులెదిటి లోకము లేదనఁగ నెట్టువచ్చు లీలకర్మము నీదాసుఁడ ననుచు నీమరఁగు చొచ్చుకొంటే యేదెసనైనాఁ బెట్టి యీడేరింతు గాక (॥ఎక్క॥) తోయ నెట్టువచ్చు మించి తొలఁకేటి నీమాయ పాయ నెట్టువచ్చుఁ యీభవబంధాలు చేయార నిన్నుఁ బూజించి చేరి నీముద్రలు మోఁచి యీయెడ నుండఁగా నీవే యీడేరింతు గాక (॥ఎక్క॥) తెలియఁగ నెట్టువచ్చు ద్రిష్టమైన నీమహిమ తలచఁగ నెట్టువచ్చు తగు నీరూపు నెలవై శ్రీవేంకటేశ నీవు గలవనుండఁగా యిలఁమీద మమ్మునీవే యీడేరింతు గాక English(||pallavi||) ĕkkaḍimadamu liṁka nemi sodiṁchemu nemu takkaga śhrībadi nīve dayam̐jūdu gāga (||ĕkka||) kādanam̐ga nĕṭṭuvachchu kannulĕdiḍi logamu ledanam̐ga nĕṭṭuvachchu līlagarmamu nīdāsum̐ḍa nanusu nīmaram̐gu sŏchchugŏṁṭe yedĕsanainām̐ bĕṭṭi yīḍeriṁtu gāga (||ĕkka||) toya nĕṭṭuvachchu miṁchi tŏlam̐keḍi nīmāya pāya nĕṭṭuvachchum̐ yībhavabaṁdhālu seyāra ninnum̐ būjiṁchi seri nīmudralu mom̐si yīyĕḍa nuṁḍam̐gā nīve yīḍeriṁtu gāga (||ĕkka||) tĕliyam̐ga nĕṭṭuvachchu driṣhṭamaina nīmahima talasam̐ga nĕṭṭuvachchu tagu nīrūbu nĕlavai śhrīveṁkaḍeśha nīvu galavanuṁḍam̐gā yilam̐mīda mammunīve yīḍeriṁtu gāga