Title (Indic)ఎక్కడనున్నాఁ బోదు యేతులైనఁ బోనీదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎక్కడనున్నాఁ బోదు యేతులైనఁ బోనీదు వొక్కటి కొక్క బంధము వూహింప నెక్కుడు (॥ఎక్క॥) బుడిబుడి మాయలఁ బొరలేటి దేహికి కడవరాని బంధము కాంతలు యెడపడ కందుకంటే నెక్కుడైన బంధము కడునాసఁ బొరలించు కనకము (॥ఎక్క॥) బాలులకు వృద్ధులకు పాయపు వివేకులకు తేలించే బంధములు దినరుచులు మూలనున్నాఁ బోనీదు ముంగిటనే వేసేది వేళ గాచిన బంధము విద్యాగర్వము (॥ఎక్క॥) పాయ దేజంతువులైనాఁ బశుపక్షులకునైనా బాయటి గీముల కట్టుఁబాటు బంధము యేయెడ శ్రీవేంకటేశ ఇంక నీదాసులకైతే చాయై చెప్పినట్టు సేసు సకలబంధములు English(||pallavi||) ĕkkaḍanunnām̐ bodu yedulainam̐ bonīdu vŏkkaḍi kŏkka baṁdhamu vūhiṁpa nĕkkuḍu (||ĕkka||) buḍibuḍi māyalam̐ bŏraleḍi dehigi kaḍavarāni baṁdhamu kāṁtalu yĕḍabaḍa kaṁdugaṁṭe nĕkkuḍaina baṁdhamu kaḍunāsam̐ bŏraliṁchu kanagamu (||ĕkka||) bālulagu vṛddhulagu pāyabu vivegulagu teliṁche baṁdhamulu dinarusulu mūlanunnām̐ bonīdu muṁgiḍane vesedi veḽa gāsina baṁdhamu vidyāgarvamu (||ĕkka||) pāya dejaṁtuvulainām̐ baśhubakṣhulagunainā bāyaḍi gīmula kaṭṭum̐bāḍu baṁdhamu yeyĕḍa śhrīveṁkaḍeśha iṁka nīdāsulagaide sāyai sĕppinaṭṭu sesu sagalabaṁdhamulu