Title (Indic)ఏకచిత్త మైనప్పు డిన్నియు మరె(ర?)య్యీఁ గాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏకచిత్త మైనప్పు డిన్నియు మరె(ర?)య్యీఁ గాని నాకు నీ వేళకు నీ నవ్వులె చాలు (॥ఏక॥) చిక్కువడివున్నది నాచిత్తము నీ చెక్కులఁ జిందరలైన జీరలవలె చక్క నన్ను మాటాడించకురా నీవూ నీకు మొక్కేను నా కింక మోనమె చాలు (॥ఏక॥) కడుఁ గాఁక రేఁగె నా కాయము నీ కడల పుక్కిటతమ్మకారమువలె పడి నా పయ్యెదకొంగు పట్టకురా నీకు వెడఁ బంత మిచ్చే నాకు విరహమె చాలు (॥ఏక॥) పరవశమాయ నా భావము గరిమ నిద్దురల నీ కన్నులవలె యిరవై శ్రీవెంకటేశ యేలితివి యిది మరిగితిమి నాకు నీ మన్ననె చాలు English(||pallavi||) egasitta mainappu ḍinniyu marĕ(ra?)yyīm̐ gāni nāgu nī veḽagu nī navvulĕ sālu (||ega||) sikkuvaḍivunnadi nāsittamu nī sĕkkulam̐ jiṁdaralaina jīralavalĕ sakka nannu māḍāḍiṁchagurā nīvū nīgu mŏkkenu nā kiṁka monamĕ sālu (||ega||) kaḍum̐ gām̐ka rem̐gĕ nā kāyamu nī kaḍala pukkiḍadammagāramuvalĕ paḍi nā payyĕdagŏṁgu paṭṭagurā nīgu vĕḍam̐ baṁta michche nāgu virahamĕ sālu (||ega||) paravaśhamāya nā bhāvamu garima niddurala nī kannulavalĕ yiravai śhrīvĕṁkaḍeśha yelidivi yidi marigidimi nāgu nī mannanĕ sālu