Title (Indic)ఈలాగు సతి గలిగె నేమి చెప్పేది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఈలాగు సతి గలిగె నేమి చెప్పేది యేలితివి నీభాగ్య మేమి చేప్పేది (॥ఈలా॥) అచ్చలపు నీచేఁతకు నలుగక జవరాలు యిచ్చకము లాడీని యేమి చెప్పేది పచ్చిదేరేనీమోవియప్పటిఁ గని పదరక యెచ్చరించీ రతులకు నేమి చెప్పేది (॥ఈలా॥) సుదతితో మాటాడఁగాఁ జూచి నిన్నుఁ గసరక యెదుటనే నవ్వు నవ్వీ నేమి చెప్పేది అదన నీవేళ్ల నాపెవుంగరా లుండఁగా యిది నీకుఁ గైలాగిచ్చీ నేమి చెప్పేది (॥ఈలా॥) వొనర నిందాకా నెందో వున్న నిన్ను దూరక యెనసె నలమేల్మంగ నేమి చెప్పేది మనికై శ్రీవేంకటేశ మన్నించఁగా బిగియక యెనలేనిమెచ్చు మెచ్చీ నేమి చెప్పేది English(||pallavi||) īlāgu sadi galigĕ nemi sĕppedi yelidivi nībhāgya memi seppedi (||īlā||) achchalabu nīsem̐tagu nalugaga javarālu yichchagamu lāḍīni yemi sĕppedi pachchiderenīmoviyappaḍim̐ gani padaraga yĕchchariṁchī radulagu nemi sĕppedi (||īlā||) sudadido māḍāḍam̐gām̐ jūsi ninnum̐ gasaraga yĕduḍane navvu navvī nemi sĕppedi adana nīveḽla nābĕvuṁgarā luṁḍam̐gā yidi nīgum̐ gailāgichchī nemi sĕppedi (||īlā||) vŏnara niṁdāgā nĕṁdo vunna ninnu dūraga yĕnasĕ nalamelmaṁga nemi sĕppedi manigai śhrīveṁkaḍeśha manniṁcham̐gā bigiyaga yĕnalenimĕchchu mĕchchī nemi sĕppedi